బాలీవుడ్ బ్యూటీలకు పోటీ

0

అక్షర గౌడ బెంగుళూరు భామ. కన్నడ.. తమిళ సినిమాల్లో నటించి గ్లామర్ ప్రియుల దృష్టికి వచ్చిన ఈ భామ అక్కినేని నాగార్జున లాస్ట్ సినిమా ‘మన్మథుడు 2’ లో ఈ భామ కూడా నటించింది. సినిమా ఫలితం నిరాశపరిచింది.. దీంతో అక్షరకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అలాంటి వాటికి నిరాశపడిపోయే రకం కాదు అక్షర. తన ప్రయత్నాలను డబల్ చేస్తుంది.. హాట్ నెస్ ను రెట్టింపు చేస్తుంది.. ఎలా అయినా ప్రేక్షకులను మెప్పించేదిశగా దూసుకుపోతుంది.

ఈ భామకు సోషల్ మీడియాలో హాటు ఫోటోలు పోస్ట్ చేయడం.. నెటిజన్లను టీజ్ చేయడం ‘మన్మథుడు 2’ లో నటించడం ముందు నుంచే అలవాటు. ఈరోజు మరోసారి అదేపని చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “నేను లక్కీ కాదు. నేను ఎలాంటిదాన్నో తెలుసా.. నేను స్మార్ట్. నేను టాలెంటెడ్. నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటాను.. నేను చాలా చాలా కష్టపడతాను – షోండా రైమ్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. షోండా రైమ్స్ ఓ అమెరికన్ రచయిత్రి.. టెలివిజన్ ప్రెజెంటర్. ఆవిడ కొటేషన్ నే ఈ బెంగుళూరు ఆవిడ కోట్ చేసింది. ఇక ఫోటో విషయానికి వస్తే గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ ఛోళీ.. గ్రీన్ కలర్ లెహెంగా ధరించి యమా హాటు పోజిచ్చింది. ఒక్కోసారి ఈ ఫ్యాషన్ తో మాచెడ్డ చిరాకు. అక్షర వేసుకున్న పై వస్త్రాన్ని టాప్ అనాలా… ఛోళీ అనాలా.. లేక రెక్కలు కత్తిరించిన రైక అనాలా? అసలు ఏమైనా వస్త్రం ఉంటే కదా ఒక పేరుతో పిలిచేందుకు అని మీరు కసురుకుంటే దానికి కూడా పెద్దగా సమాధానం లేదు. అసలే వయ్యారమైన పై వస్త్రం.. ఈవిడ మరింత వయ్యారంగా కూర్చుని అందాలను ఆరబోసింది. అంతే.

ఫోటో చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఫేస్ కు పర్ఫెక్ట్ మేకప్.. మెడలో నాణేల చెయిన్ తో అక్షరలోని ప్రతి అణువులో సెక్సీనెస్ కనిపిస్తోంది. “నువ్వు అర్థ నగ్నంగా ఉన్నావు”.. “సో సో సెక్సీ”.. “కిల్లర్ పోజ్.. క్రేజీ యాటిట్యూడ్”.. “బాలీవుడ్ బ్యూటీలకు పోటీ”.. అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోకు మన టాలీవుడ్ గూఢచారి అడివి శేష్ ఓ లైక్ వేసుకున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే అక్షర ప్రస్తుతం ‘త్రివిక్రమ’ అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.Please Read Disclaimer