బ్లాక్ డ్రెస్ లో గ్లోబల్ సుందరి

0

గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా జోనాస్ ఫ్యాషన్ సెన్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. ప్రియాంక ఎలాంటి డ్రెస్ ధరించినా అది మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సాధారణంగానే ఫ్యాషనబుల్ డ్రెస్సులలో అందరినీ ఆకట్టుకునే పీసీ ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఇక డిజైనర్ డ్రెస్సులు ధరించి తన హాట్ నెస్ ను రంగరిస్తుంది. ఈమధ్య ఒక సందర్భంలో అలానే తనదైన శైలి లో అందరిని ఆకర్షించింది.

రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ లో పింక్ డ్రెస్ లో మతులు పోగొట్టిన ప్రియాంక చోప్రా తాజాగా మరో డ్రెస్ తో హాట్ టాపిక్ అయింది. నలుపు రంగు డిజైనర్ మిడ్డీ ధరించి తన భర్త నిక్ జోనాస్ చేతుల్లో చేతులు వేసుకొని స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది. ఎరుపు రంగు లిప్ స్టిక్.. చేతిలో ఒక స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ ధరించింది. డ్రెస్ కొన్ని చోట్ల పారదర్శకంగా ఉండడం తో నడుము భాగం కొంత.. కాళ్లు కొంత భాగం కనిపించడంతో అక్కడ ఉన్న జనాలు డంగై పోయారు..అక్కడ లేకపోయినా ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అందరూ చిత్తై పోయారు. ఇక పక్కనే ఉన్న నిక్ కూడా సూటు బూటు ధరించి దొరబాబులా కనిపిస్తున్నాడు

ఈ ఫోటోలు బయటకు రావడమే ఆలస్యం.. వైరల్ గా మారాయి. ఇక ప్రియాంక చోప్రా సినిమాల విషయానికి వస్తే ‘వుయ్ కెన్ బి హీరోస్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు రాబర్ట్ రోడ్రిగ్స్ దర్శకుడు. ఈమధ్య హాలీవుడ్ సినిమాలలో నటిస్తుండడంతో ప్రియాంక హిందీ సినిమాలు సైన్ చెయ్యడం లేదు.
Please Read Disclaimer