చరణ్ ఉపాసన.. న్యూ ఇయర్ ఇలా

0

సెలబ్రిటీలందరూ దాదాపు గా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం మన దేశంలోనే హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నూతన సంవత్సర వేడుకలను సతీమణి ఉపాసనతో కలిసి గోవాలో జరుపుకున్నారు.

‘RRR’ షూటింగ్ కు న్యూ ఇయర్ సందర్భం గా గ్యాప్ ఇచ్చి మరీ గోవా ట్రిప్ కు వెళ్ళారట. జనవరి 3 వ తేదీ చరణ్-ఉపాసన జంట హైదరాబాద్ కు తిరిగి వస్తారట. చరణ్ మొదటి నుంచి పక్కా ఫ్యామిలీ మ్యాన్. సమయం దొరికితే చాలు తన కుటుంబంతో గడిపేందుకు రెడీ అవుతారు. లేదా ఉపాసనతో కలిసి ఏదో ఒక హాలిడేకి వెళ్తుంటారు. ఈసారి అదే స్టైల్ ఫాలో అవుతూ ఉపాసనతో న్యూ ఇయర్ వేడుకలు గోవాలో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా చరణ్-ఉపాసన కలిసి బోటు పై తీయించుకున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో చరణ్ వైట్ టీ షర్టు.. గ్రే కలర్ ప్యాంట్ ధరించి క్యాజువల్ స్టైల్ లో ఉన్నారు. క్యాప్.. కళ్ళజోడు.. ఒక బ్యాగ్ తగిలించుకుని ఫోటోకు పోజిచ్చారు. ఒక ఉపాసన కూడా తెలుపు రంగు డ్రెస్ ధరించి మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టుగా ఉంది.

సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ఒక ఏడాది నుంచి రాజమౌళి ‘RRR’ షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా లో నటించడం తో పాటు గా చరణ్ చిరంజీవి-కొరటాల శివ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ త్వరలోనే తన నెక్స్ట్ సినిమాను ఫైనలైజ్ చేస్తారని కూడా అంటున్నారు.
Please Read Disclaimer