తడిపొడి తపనల రత్తాలు సిత్తడే

0

సెక్సిణి రాయ్ లక్ష్మీ ప్రస్తుతం ఏం చేస్తోంది? రత్తాలుగా రఫ్ఫాడించేసిన రాయ్ లక్ష్మి బొత్తిగా కంటికి కనిపించకుండా పోయింది. ఇంతకీ ఈ అమ్మడి కెరీర్ జీరో అయిపోయినట్టేనా? అంటే.. ఇప్పట్లో అందుకు ఆస్కారం లేనేలేదు. ప్రస్తుతం ఈ భామ జీ 5 ఓటీటీ వేదిక పై `పాయిజన్ 2` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ఇన్నాళ్లు వెండితెర దునియా.. ఇకపై ఓటీటీ దునియాలో అడుగుపెట్టింది. అక్కడా తనదైన శైలిలో విరుచుకుపడబోతోంది. తాజా సిరీస్ లో బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసాని సరసన రాయ్ లక్ష్మీ నటిస్తోంది. ఇటీవలే రిలీజైన పోస్టర్ లో ఆఫ్తాబ్ తో రాయ్ లక్ష్మీ రొమాన్స్ హీటెక్కించింది. ప్రేమ – ప్రతీకారం కాన్సెప్టుతో ఉత్కంఠ రేపే హై ఓల్టేజ్ కథతో పాయిజన్ 2 తెరకెక్కిన ఈ సిరీస్ ఏప్రిల్ 30 నుండి జీ5లో ప్రసారం కానుంది. ఇక ఓటీటీపైనా రాయ్ లక్ష్మీ మంటలు పెట్టేయబోతోంది.

ఆ క్రమంలోనే ఈ సిరీస్ లో రాయ్ లక్ష్మీ ఏ లెవల్లో వేడెక్కించబోతోంది? అన్నదానికి ఇదిగో లేటెస్టుగా రిలీజైన ఈ ఫోటోనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఆకాశ హార్మ్యాలను తలపించే భవంతులపై రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లో తడిపొడి స్విమ్ సూట్ లో ఇలా దర్శనమిచ్చింది. రాయ్ లక్ష్మీ రఫ్ఫాడేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో జోరుగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం సిండ్రెల్లా- మిరుగ అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. సిండ్రెల్లా చిత్రంలో రాయ్ లక్ష్మీ లేడీ ఘో స్ట్ రైడర్ ని తలపించబోతోంది. థియేటర్లు దద్దరిల్లే హారర్ టెర్రర్ ట్రీట్ ని రెడీ చేస్తోంది.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-