భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

థై సొగసుపైనే రంగమ్మత్త ఫోకస్

0

సోషల్ మీడియా ప్రమోషన్స్ లో అందాల భామల స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. టాప్ హీరోయిన్లు.. మిడ్ రేంజ్ హీరోయిన్లు అనే డిఫరెన్స్ లేనే లేదు. నిరంతరం గ్లామర్ ప్రపంచంలో తాము ప్రమోట్ చేసుకుని అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ముద్దుగుమ్మలు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇక ఈ జాబితాలో యాంకర్లు.. యాంకర్ కం నటీమణులు కూడా జోరుమీదున్నారు.

ఇంతకుముందు యాంకర్ అంటే కొన్ని రూల్స్ ఉండేవి. హద్దు దాటకుండా.. కాస్త పద్ధతిగా సంప్రదాయ బద్ధంగా పరిమితుల మధ్య గ్లామర్ ఎలివేషన్ చేయాల్సి వచ్చేది. కానీ అనసూయ లాంటి హాట్ యాంకర్ రంగ ప్రవేశం యాంకరింగ్ ని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. గ్లామర్ ఎలివేషన్ పరంగా రూల్స్ కట్టుబాట్లు అనేవి కాస్త తెరమరుగయ్యాయి. ఇక రంగమ్మత్తగా పాపులరయ్యాక హాట్ యాంకర్ అనసూయ తీరుతెన్నులపై సోషల్ మీడియాలో క్రిటిసిజం పీక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నెటిజనులకు చెంప పెట్టు లాంటి సమాధానం ఇస్తూ తాను అనసూయ అని ప్రూవ్ చేస్తోంది. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియాల్లో అనసూయ ఎక్స్ పోజింగ్ కాస్త అదుపు తప్పిందనే నెటిజనుల్లో హాట్ డిబేట్ రన్ అవుతోంది.

రెగ్యులర్ ఫోటోషూట్లతో రంగమ్మత్త విరుచుకుపడుతోంది. తాజాగా అనసూయ ఫ్లోరల్ డిజైనర్ లుక్ యూత్ లో వైరల్ గా మారింది. ఇక ఈ డిజైనర్ థై స్లిట్ డ్రెస్ లో అనసూయ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. రంగమ్మత్త గా పాపులారిటీ దక్కాక వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్ని- సుకుమార్ సినిమాలోనూ అనసూయ అదిరిపోయే పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఈ హుషారు తగ్గక ముందే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు యూత్ లో నిరంతరం ఇలా టచ్ లో ఉంటోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-