శర్వా కాజల్ కెమిస్ట్రీ పర్ఫెక్ట్

0

సుమారు ఏడు నెలల గ్యాప్ తో వస్తున్న శర్వానంద్ వచ్చే ఆగస్ట్ 15 రణరంగంతో పలకరించబోతున్నాడు. ఇప్పటికే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు ఆడియో సింగిల్స్ బాగా రీచ్ అయ్యాయి. తాజాగా ఓ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్ అంటూ సాగే ఈ పాటలో కాజల్ అగర్వాల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. విదేశాల్లోని ఓ సముద్రం ఒడ్డున రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ చుట్టూ స్నేహాతులు మోడల్స్ ఆడిపాడుతుండగా కాజల్ ఓ రేంజ్ లో రచ్చ చేయడం హై లైట్ అయ్యింది.

డాన్స్ చేస్తూనే ఓరకంటితో శర్వాను కవ్వించేలా చూడటం తనని చూసి చూడనట్టు అతను తెలివిగా నడుచుకుంటూ పోవడం బాగా వచ్చింది. స్టెప్స్ లేకపోయినా దూరంగా ఉంటూనే ఇద్దరి మధ్య వెరైటీగా కెమిస్ట్రీ నడిపించిన సుధీర్ వర్మ స్టైలిష్ మేకింగ్ తో వీడియోని కలర్ఫుల్ గా మార్చేశాడు. మధ్యలో శర్వా ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన యాక్షన్ బ్లాక్స్ బోనస్ గా నిలిచాయి

మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న రణరంగంలో ప్రశాంత్ పిళ్ళై సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్ కంపోజ్ చేసింది మాత్రం సన్నీ. వైజాగ్ లో నేర సామ్రాజ్యంలో అడుగు పెట్టిన ఓ యువకుడు విదేశాల దాకా ఎలా దాన్ని విస్తరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చిందనే పాయింట్ మీద రూపొందిన రణరంగంలో కల్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. దివాకర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ మీద అభిమానుల ఆశలు భారీగా ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే రోజు వస్తున్న రణరంగం శర్వానంద్ కెరీర్ లో ప్రస్థానం తర్వాత అంత మెమరబుల్ మూవీ అవుతుందనే అంచనాలు ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి.
Please Read Disclaimer