బాలయ్యతో `పింక్` రీమేక్ ప్లాన్?

0

టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు తీసిన నిర్మాత అనిపించుకోవాలన్నది దిల్ రాజు కోరిక. అది నెరవేర్చుకునే దిశగా ఆయన సన్నాహకాల్లో ఉన్నారట. సీనియర్ హీరోలు నాగార్జున.. వెంకటేష్ తో సినిమాలు తీసి విజయాలు అందుకున్నారు. కానీ బాలకృష్ణ.. చిరంజీవి తో సినిమాలు తీయాలన్న ప్లాన్ కూడా రాజుగారికి ఉంది. అందుకే తొలిగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అది కూడా బాలీవుడ్ లో రిలీజై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన `పింక్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారట. తొలుత బాలయ్యకు స్క్రిప్టు వినిపించి ఫైనల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు.

అంతేకాదు బాలీవుడ్ లో `ఎఫ్ 2` చిత్రాన్ని రీమేక్ చేస్తున్న నిర్మాత బోనీ కపూర్ తెలుగులో `పింక్` రీమేక్ కి దిల్ రాజుతో జోడీ కడతారట. ఇప్పటికే `లాయర్ సాబ్` అనే టైటిల్ అనుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికి దిల్ రాజు- బోనీ పార్టనర్స్ గా ప్లాన్.. జరుగుతోందని ప్రచారం అవుతోంది. అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు.

ప్రస్తుతం `పింక్` చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా `నేర్కొండ పర్వాయ్` అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 10 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బోనీతో దిల్ రాజు కొత్త ప్రయత్నంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దిల్ రాజు ఇప్పటికే `ఎఫ్ 2` హిందీ వెర్షన్ ని బోనీతో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer