ఆలూ లేదు చూలు లేదు అప్పుడే టైటిల్?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా విషయంలో చాలా రోజుల నుండి జోరుగా చర్చలు సాగుతున్నాయి. పవన్ సినిమా విషయం ఇప్పటికే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ‘పింక్’ రీమేక్ లో పవన్ నటిస్తున్నారని ఆయిన చెప్పారు. అయితే పవన్ నుంచి.. మెగా కాంపౌండ్ నుంచి ఈ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్.. షూటింగ్ వివరాలపై వార్తలు ఊపందుకోవడంతో మరోసారి పవన్ సినిమా హాట్ టాపిక్ అయింది.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్.. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తారట. త్రివిక్రమ్ ప్రస్తుతం ‘పింక్’ సినిమా స్క్రిప్ట్ ను పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తున్నారట. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు పూజా హెగ్డేని ఎంచుకున్నారట. ఈ సినిమా ఎక్కువ భాగం కోర్టులోనే సాగుతుంది కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో కోర్టు సెట్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ కొందరు మాత్రం ఈ అప్డేట్లపై “ఆలూ లేదు చూలు లేదు అప్పుడే సినిమా టైటిల్ పెట్టారు” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే పవన్ ఇంతవరకూ తన రీ ఎంట్రీ విషయంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. అసలు సినిమా చేస్తారో లేదో తెలియదు. చేస్తారో లేదో తెలియని సినిమాకు అప్పుడే ఈ టైటిల్ హడావుడి మరీ విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఏదేమైనా పవన్ సినిమా విషయంలో క్లారిటీ రావాలంటే మనం కొంతకాలం వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer