మే 23న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ చిత్రం

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెల్సిందే. జనసేనాని ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. బిజెపితో కలిసి ముందుకు సాగుదాం అని నిర్ణయించుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా అధికార పార్టీని ప్రశ్నిస్తూ వస్తున్నాడు. తన రాజకీయ మనుగడకు ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇలాంటి నేపథ్యంలో పవన్ రాజకీయాలను వదిలి సినిమాల్లోకి వస్తాడా అన్న ప్రశ్న ఉన్నా కానీ మరోవైపు చకచకా పవన్ రీ ఎంట్రీకి సంబంధించిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి.

పవన్ కళ్యాణ్ పింక్ సినిమాతో రీ ఎంట్రీకి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నివేతా థామస్, అంజలి, అనన్యలను ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. థమన్ సంగీతం అందించనున్నాడు. అయితే పింక్ చిత్రానికి దీనికి కథ పరంగా పవన్ ను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తున్నారు. ఇందులో పవన్ కు హీరోయిన్ ఉంటుంది. ఒక డ్యూయెట్, రెండు ఫైట్స్ కూడా ఉండనున్నాయి.

పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డేను నటింపజేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 20 నుండి మొదలవుతున్నట్లు రూమర్ మొదలైంది. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మే 23న సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు భోగట్టా. మరి చూడాలి ఇది ఎంత వరకూ నిజం కానుందో.
Please Read Disclaimer