‘అరవింద సమేత’ కు పైరసీ దెబ్బ..

0

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయిన మూవీ ‘అరవింద సమేత’కు ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైంది. బెనిఫిట్ షోలు – ప్రీమియర్ షోలతో నిన్న రాత్రి నుంచే సందడి మొదలైంది. ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న ఈ మూవీకి అనుకోని షాక్ తగిలింది.

అరవింద్ సమేత సినిమా బృందానికి షాకిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ తొలిరోజే.. తొలి ఆటతోనే పైరసీ బారిన పడింది. అర్ధరాత్రి 12.30 తర్వాత మొట్టమొదటి షో పడుతూనే ఇదిగో తాను అరవింద సమేత చూస్తున్నానంటూ కొందరు కొన్ని స్క్రీన్ షాట్లు పలు ఫైట్ సీన్లను వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఇందులో హీరో ఎంట్రీ యాక్షన్ ఎపిసోడ్స్ డ్యాన్స్ మూమెంట్స్ ఇలా అన్నింటిని బిట్లు బిట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో తమ ఉత్సాహం చూపించారు. అయితే ఇదే ఇప్పుడు ‘అరవింద సమేత’ సినిమాకు శాపంగా మారింది.

బాహుబలి మూవీ సమయంలోనూ ఇలా తమిళనాడులో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి సినిమాకు తీవ్ర దెబ్బగా మారింది. ఆ తర్వాత రంగస్థలం – భరత్ అనే నేను సినిమాలకు ఇదే దెబ్బ పడింది. ఇప్పుడు అరవింద సమేతకు అదే పరిస్థితి ఎదురైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత కట్టడి చేస్తున్నా సరే.. ఇతర హీరోల అభిమానులు ఈ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు సినిమా థియేటర్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లనీయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Please Read Disclaimer