బస్ లో పైరసీ ‘కే టీ ఆర్’ కి రిక్వెస్ట్ !

0

ఈ మధ్య సందు దొరికితే చాలు కస్టమర్స్ ను కొత్త సినిమాలతో ఎట్రాక్ట్ చేస్తున్నారు బస్ సిబ్బంది. అవును ట్రావెల్ బస్ లో రాత్రి పూట కస్టమర్లను ఖుషీ చేయడానికి కొత్త సినిమాలు (పైరసీ_ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం అందరి దృష్టికి వెళ్ళింది. తాజాగా భీష్మ సినిమా విషయంలోనూ అదే జరిగింది. సినిమా మొదటి షోకేసూపర్ హిట్ టాక్ అందుకొని మంచి కలెక్షన్స్ సాదిస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమాను బస్ ప్లే చేసారు. ఈ విషయన్ని బస్ లో ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసి డైరెక్టర్ వెంకీ కుడుములను ట్యాగ్ చేసాడు. వెంటనే వెంకీ కుడుముల రెస్పాండ్ అయి పైరసీను అరికట్టాలని తమ కష్టాన్ని ఇలా దొంగతనంగా చూడకండి అంటూ రియాక్ట్ అయ్యాడు. తెలంగాణా బస్ లో ఇలా పైరసీ ప్లే చేస్తున్నారంటూ కే.టి.ఆర్ దృష్టికి తీసుకెళ్ళాడు వెంకీ.

మాకు ఏ ప్రాబ్లం వచ్చిన ట్యాగ్ చేయాలనిపించే ఏకైక వ్యక్తి మీరే అంటూ కే.టి.ఆర్ ను ట్యాగ్ చేసి విషయం తెలియజేసి రియాక్ట్ అయ్యి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరాడు. మరి ఈ విషయంపై ట్విట్టర్ లో కే.టి.ఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-