కాజల్ మైండ్ లో ప్లాన్ బి

0

ఎప్పుడూ ఒకేచోట పని చేస్తే బోరింగ్. అందుకే అప్పుడప్పడు పని చేసే చోటు మార్చాలి. ఈ విషయంలో మన భామలు చాలానే తెలివిమీరిపోయారు. ఒకచోట సక్సెస్ దక్కకపోతే ఇంకోచోటికి పలాయనం చిత్తగించడంలోనూ మన అమ్మణ్ణుల్ని చూసి నేర్చుకోవాల్సిందే. పక్క పక్కనే మూడు నాలుగు పడవల్ని సిద్ధం చేసుకుని ఏ పడవ మునగదో ఆ పడవలోకి జంప్ చేస్తున్నారు.

ఇందుకు చందమామ కాజల్ కూడా మినహాయింపేమీ కాదు. ఈ అమ్మడికి ఇటీవల వరుసగా ఫ్లాపులొస్తున్నాయి. పైగా సౌత్ లో తలపెట్టిన ప్రాజెక్టులు ఎందుకనో గన్ షాట్ గా చెప్పిన టైముకే పూర్తవ్వడం లేదు. దీనికి తోడు రిలీజ్ ల డైలమా మరో చిరాకు. తాను ఎంతో నమ్మి చేసిన ప్యారిస్ ప్యారిస్ (క్వీన్ రీమేక్) రకరకాల వివాదాల నడుమ రిలీజ్ కావడం లేదు. గురువు తేజను నమ్మి `సీత` సినిమాలో నటిస్తే బిగ్ డిజాస్టర్ అయ్యింది. మరోవైపు `భారతీయుడు 2` తిప్పల గురించి చెప్పాల్సిన పనేలేదు. అందుకే కాస్తంత వెగటు పుట్టిందో ఏమో కానీ కొన్నాళ్ల పాటు సౌత్ కి దూరమైతే తప్పేమీ కాదని భావించినట్టుంది. అందుకే ప్లాన్ బిని అనుసరిస్తోందని తెలుస్తోంది

ప్రస్తుతం మరోసారి ముంబై పరిశ్రమపైనా ఓ కన్నేసి ఉంచింది. ఆ క్రమంలోనే ఈ అమ్మడిని అదిరిపోయే ఆఫర్ వరించిందని తెలుస్తోంది. కిలాడీ అక్షయ్ కుమార్ సరసన అపుడెపుడో స్పెషల్ చబ్బీస్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇన్నాళ్టికి కండల హీరో జాన్ అబ్రహాం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సునీల్ శెట్టి – సాహో స్టార్ జాకీ ష్రాఫ్ సహా పలువురు టాప్ స్టార్లు నటిస్తున్నారు. ముంబైలో గ్యాంగ్ స్టర్ లైఫ్ పై తీస్తున్న చిత్రమిదని తెలుస్తోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే కాజల్ ఇటీవలే తమిళంలో కోమలి చిత్రంతో విజయం అందుకుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఊరట ఉంటుంది కాబట్టి సౌత్ ని మాత్రం పూర్తిగా విడిచిపెట్టదులెండి!
Please Read Disclaimer