ట్రంప్ ను ఇబ్బందిపెడుతున్న రాసలీలలు

0అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పోర్న్‌ స్టార్‌ స్టోర్మీ డేనియల్స్ తో లైంగిక సంబంధం ఉన్నట్లు అప్పట్లో ఓ కథనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. స్టోర్మీ డేనియల్స్ ప్రస్తుతం ఆయనపై న్యాయపోరాటానికి దిగింది. తనతో ట్రంప్ చేసుకున్న ఎగ్రీమెంట్ చట్టరిత్యాలేదని కోర్టుకు వెళ్ళింది స్టోర్మీ.

ఇదీలావుంటే తాజాగా 2006-07 మధ్యలో పది నెలల పాటు ట్రంప్ తో సాగిన రహస్య సంబంధంపై చేసుకున్న ఒప్పందం నుంచి బయటపడేయాలంటూ ప్లేబాయ్‌ మాజీ మోడల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్‌ లాస్‌ ఏంజిల్స్‌ సుపీరియర్‌ కోర్టులో దావా వేసింది. ట్రంప్‌ తో ఎఫైర్‌ గురించి బయటకు వెల్లడించవద్దంటూ నేషనల్‌ ఎంక్వైరర్‌ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్‌ మీడియా ఇంక్‌ 2016లో తనకు లక్ష 50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలోపేర్కోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.