ఆడపిల్ల పుట్టింది.. పేరు చెప్పండి: ఉపాసన

0

ఇంట్లో పిల్లలు పుడితే మొదట ఆలోచించేది వారికి ఏం పేరు పెడదామా అనే కదా. మెగాఫ్యామిలీ కోడలమ్మ.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ప్రస్తుతం అదేపనిలో ఉన్నారు. రీసెంట్ గా ఉపాసన ఇంటికి కొత్త మెంబర్ వచ్చారట. ఆ మెంబర్ ఒక గుర్రం పిల్ల. ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఆ మెగా పిల్ల గుర్రానికి మంచి పేరు సూచించాల్సిందిగా అభిమానులను కోరారు.

తల్లిగుర్రం.. పిల్లగుర్రం ఫోటోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ అభిమానులను పేరు సజెస్ట్ చేయమని కోరడంతో అభిమానులు పోటీలు పడి మరీ పేర్లు సూచిస్తున్నారు. చాందిని.. బేబీ.. రాణి.. సోని.. కాజోల్.. రీనా.. గ్రేసీ.. హార్వీ.. బంగారం.. సనా.. మిస్సీ అంటూ చాలా పేర్లు ఇప్పటికే సజెస్ట్ చేశారు. పిల్ల గుర్రం ఎంతో అందంగా ఉందని చాలామంది మెచ్చుకున్నారు. చరణ్ ఉపాసన జంటకు జంతువులంటే వల్లమాలిన ప్రేమ. చరణ్ ఫామ్ హౌస్ లో గుర్రాలతో పాటుగా.. పలు జంతువులు.. పక్షులు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొందరు అభిమానులు “వదినమ్మా.. ఈ పిల్లగుర్రం సంగతి సరే..జూనియర్ చరణ్ ఎప్పుడు వస్తాడు?” అంటూ వారసుడి ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో కూడా అభిమానులు పలు సందర్భాలలో ఉపసానను ఇలా ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ చరణ్-ఉపాసన మాత్రం ఇప్పుడే అలాంటి ఆలోచన లేదన్నట్టుగా దాటవేస్తున్నారు.
Please Read Disclaimer