నటి వనితా మూడో పెళ్లి.. ఆమె భర్తపై కేసు?

0

ప్రముఖ నటి మూడో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వివాహ బంధాలు నిలబడక తాజాగా మూడో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి కాగానే ఆమె భర్తపై కేసు నమోదైంది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. సీనియర్ నటులు మంజులు-విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ రెండో పెళ్లి కూడా పెటాకులు కావడంతో మూడో పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

లాక్ డౌన్ కారణంగా అతికొద్దిమంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇదివరకే వనితకు రెండు పెళ్లిళ్లు జరిగి ముగ్గురు సంతానం ఉన్నారు.

ఆమె మూడో పెళ్లిలో ప్రత్యేకంగా వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా కనిపించి అలరించింది. అంతేకాదు.. గట్టిగా ప్రియుడిని ఈ కరోనా టైంలో ముద్దుపెట్టుకోవడం దుమారం రేపింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా నిన్న వివాహం చేసుకున్న వనిత-పీటర్ పాల్ జంటపై పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Please Read Disclaimer