`ఆమె` వల్గర్ .. రిలీజ్ ఆపకపోయారో!!

0

అమలాపాల్ బోల్డ్ యాక్ట్ ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్. కథానాయికగా రీఎంట్రీ ఇస్తూ ఈ అమ్మడు చెలరేగిపోవడంపై సర్వత్రా వాడి వేడిగా చర్చ సాగుతోంది. అమలాపాల్ కేరాఫ్ సెన్సేషన్స్ అంటూ అంతా ముచ్చటించుకుంటున్నారు. ఈ శుక్రవారం అమలాపాల్ బోల్డ్ గా నటించిన ఆడై (ఆమె) రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ఆధునిక భావాలున్న యువతిగా అమలా నటించారు. టీజర్.. ట్రైలర్ లో పాశ్చాత్య ధోరణి ఉన్న మోడ్రన్ యువతిగా నగ్నంగా కనిపించడం పెద్ద షాక్ ట్రీట్ నే ఇచ్చింది. పుట్టేప్పుడు డ్రెస్ తొడుక్కుని పుడతామా? బట్టలు విప్పేస్తే తప్పేంటి? అంటూ ట్రైలర్ లోనూ అమలాపాల్ పాత్రను ఎలివేట్ చేయడంతో ఈ సినిమాలో అందాల ఆరబోతకు అమలాపాల్ ఏమాత్రం అడ్డు చెప్పలేదని అర్థమైంది. సిగరెట్ తాగుతూ.. బ్యాచిలర్ పార్టీలో అమలా ఇచ్చిన జోల్ట్ హీటెక్కించింది. ఇటీవల రిలీజైన టీజర్.. ట్రైలర్.. పోస్టర్ ప్రతిదీ ఓ సెన్సేషన్.

అయితే అమలాపాల్ నగ్నంగా నటించడంపై మహిళామణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆడై పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయని .. ఈ సినిమా ప్రభావం సొసైటీపై తీవ్రంగా ఉంటుందని చెన్నయ్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. రాజేశ్వరి ప్రియ అనే చెన్నయ్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళన బాట పట్టారు. ఆడై రిలీజ్ ఆపకపోతే రోడ్లపై ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని ఆమె హెచ్చరించారు. దీంతో ఆడై రిలీజ్ కి ఇబ్బందులు ఎదురు కానున్నాయా? అన్న చర్చా మొదలైంది.

మరోవైపు ఈ శుక్రవారం సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహకాల్లో ఉంది. హార్డ్ హిట్టింగ్ బోల్డ్ కంటెంట్ మూవీ అంటూ ఆడై టీమ్ ప్రచారం వేడెక్కిస్తోంది. తమిళంలో ఆడై.. తెలుగులో ఆమె పేరుతో రిలీజవుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్స్ కి తావివ్వబోతోందో వేచి చూడాలి. రచ్చాసన్ తర్వాత అమలాపాల్ నటించిన ఈ సినిమాపైనే అందరి కళ్లు. వివాదాలతో ప్రచారం ఈ బ్యూటీకి వర్కవుటైందా లేదా? అన్నది వేచి చూడాలి.
Please Read Disclaimer