వకీల్ సాబ్ లీకులపై పోలీసులకు ఫిర్యాదు?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం `వకీల్ సాబ్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో దిల్ రాజు- బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇంకా 20 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. మహమ్మారీ క్రైసిస్ వల్ల షూటింగ్ అంతకంతకు వాయిదా పడుతోంది.

అయితే ఉన్నట్టుండి వకీల్ సాబ్ మూవీ క్లిప్ .. ఫోటోలు అంతర్జాలంలో లీకవ్వడం కలకలం రేపింది. దీంతో పవన్ అభిమానులు షాక్ కు గురయ్యారు. షూటింగ్ స్పాట్ నుండి లీకులు ఇవి. ఇందులో ఓ ఫోటోతో పాటు వీడియో క్లిప్ కూడా లీకైందని ప్రచారమైంది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి వీడియో క్లిప్ అంతర్జాలంలో వైరల్ కాలేదు.

అయితే ఈ లీకులపై నిర్మాత దిల్ రాజు సీరియస్ గా ఉన్నారని ఆయన సైబర్ క్రైమ్ పోలీసుల్ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారని ప్రచారమవుతోంది. ముఖ్యంగా ఫుటేజీ లీక్ పై సీరియస్ గా ఉన్నారట. మూడు నాలుగు నెలలుగా లాక్ డౌన్ పీరియడ్ అందరికీ ఇబ్బందికరంగా మారింది. ల్యాబుల నుంచి లీకులు వచ్చేస్తే అది పెను ప్రమాదకరం. అందుకే ముందస్తు జాగ్రత్త తీసుకోబోతున్నారట.

గతంలో పవన్ కల్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` చిత్రం గంట విజువల్స్ ఆన్ లైన్ లో లీకైపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో నిర్మాత బీవీఎస్.ఎన్ ప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఈ మ్యాటర్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. వకీల్ సాబ్ మ్యాటర్ అంత సీరియస్ కాదు కానీ.. ఎలాంటి లీకులు లేకుండా ముందస్తుగానే దిల్ రాజు జాగ్రత్తలు వహిస్తున్నారట.
Please Read Disclaimer