పర్సనల్ ఫొటోల లీక్ లో అనుమానాలెన్నో!

0

అక్షర హాసన్ పర్సనల్ ఫొటోలు ఇంటర్నెట్ లో లీక్ అవ్వడం చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. తన పర్సనల్ ఫొటోలు లీక్ అవ్వడంతో పోలీసులను మరియు సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ను అక్షర హాసన్ ఆశ్రయించిన విషయం తెల్సిందే. అక్షర హాసన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఈ సమయంలోనే బాలీవుడ్ లో కూడా అక్షర హాసన్ ఫొటోల లీక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు అక్షర ఆ ఫొటోలు ఎందుకు దిగాల్సి వచ్చింది మొబైల్ లో జాగ్రత్తగా ఉండే ఫొటోలు ఎలా లీక్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నారు.

సోషల్ మీడియా అకౌంట్స్ను హ్యాక్ చేయడం సాధ్యమే కాని స్మార్ట్ ఫోన్స్ ను హ్యాక్ చేయడం అంత సుభమైన విషయం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం హాలీవుడ్ స్టార్స్ మొబైల్స్ హ్యాక్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కాని అందులో నిజమెంత అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు అక్షర హాసన్ మొబైల్ హ్యాక్ అవ్వడం వల్లే ఈ ఫొటోలు లీక్ అయ్యాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని అక్షర హాసన్ మొబైల్ హ్యాక్ కాలేదని నిపుణులు చెబుతున్నారట.

అక్షర మొబైల్ మరెవ్వరి చేతికైనా వెళ్లి ఉంటుందని వారు ఫొటోలను లీక్ చేశారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అక్షర హాసన్ ఫొటోలు లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది లీక్ చేసిన వారికి ఏం లాభం అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారట.

సోషల్ మీడియాలో మాత్రం అక్షర హాసన్ డ్రామాలు ఆడుతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు లేక గత కొంత కాలంగా మీడియా దృష్టిలో పడని అక్షర హాసన్ ఈ ఎపిసోడ్ తో ఫుల్ పబ్లిసిటీ దక్కించుకుంది. ఈ పబ్లిసిటీ కోసమే అక్షర హాసన్ ఈ పని చేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Please Read Disclaimer