పరారీలో బండ్ల గణేష్.. పోలీస్ గాలింపు

0

సినీ నటుడు.. నిర్మాత బండ్ల గణేష్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరో నిర్మాత.. ఫైనాన్షియర్ పీవీపీతో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన గొడవ ఇందుకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో బండ్ల గణేష్ అప్పట్లో టెంపర్ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రకరకాల గొడవలు అప్పట్లోనే ప్రముఖంగా చర్చకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. టెంపర్ చిత్రానికి రూ.30కోట్ల పెట్టుబడిని పీవీపీ సర్ధుబాటు చేశారని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ ముందు అసలు చెల్లించేశారు. కానీ దానిపై బ్యాలెన్స్ చెల్లించాల్సిన దానికి గణేష్ అప్పట్లోనే పీవీపీకి చెక్కులు ఇచ్చారు.

ఆ మొత్తం చెల్లించాల్సిందిగా బండ్ల గణేష్ ని పీవీపీ అడిగారట. అయితే డబ్బు చెల్లించకపోగా గణేష్ అనుచరులు కొందరు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారట. దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్ తో పాటు ఆయన అనుచరులపై ఐపీసీ 448- 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు గురించి తెలిసిన అనంతరం బండ్ల గణేష్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సినీరంగంలో నిర్మాతలతో ఫైనాన్షియర్ల లాలూచీల విషయమై ఈ తరహా వివాదాలు రెగ్యులర్ గా చూస్తున్నదే. ఇంతకుముందు ముంబై పాన్ మసాలా వాలా .. ది గ్రేట్ బిజినెస్ మేన్ కం హీరో సచిన్ తోనూ బండ్ల గణేష్ ఆర్థిక వ్యవహారాల్లో గొడవ పడిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer