అరెస్ట్ కు వచ్చిన పోలీసులపై పీవీపీ కుక్కలు వదిలాడా?

0

ఏపీ వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే పీవీపీ హైదరాబాద్ లో ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంటి నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంటే పీవీపీ తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశాడని విక్రమ్ కైలాష్ అనే వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పీవీపీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ స్టేషన్ లో ప్రశ్నించారు.

ఈ వివాదంపై పీవీపీ కూడా స్పందించారు. తాను విల్లాలు విక్రయించినప్పుడు ఎలాంటి రూఫ్ టాప్ ల నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో ఉందని.. కానీ అక్రమంగా తాను అమ్మిన విల్లాలో పలు నిర్మాణాలు చేస్తున్నందుకే ఇలా కూల్చేశానని తెలిపారు.

అయితే తాజాగా బంజారాహిల్స్ గొడవ కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14కు వెళ్లినట్టు తెలిసింది. అయితే అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై పీవీపీ కుక్కలను వదిలినట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే విధులకు పీవీపీ ఆటంకం కలిగించారని జూబ్లీహిల్స్ పీఎస్ లో పీవీపీపై కేసు పెట్టినట్టు తెలిసింది.

కాగా పోలీసులపై పీవీపీ కుక్కలు వదిలిన ఘటనపై పోలీస్ ఉన్నాతాధికారులు సీరియస్ అయ్యారని బంజారాహిల్స్ పీఎస్ కు సీపీ అంజనీకుమార్ వచ్చినట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు.
Please Read Disclaimer