సుశాంత్ సింగ్ కేసులో ఊహించని కొత్త ట్విస్టు

0

యువహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై రకరకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 27 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. ఆ తర్వాత కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

తాజాగా ఈ కేసులో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తిని పోలీసులు ఆరా తీస్తున్నారు. రియా బ్రదర్ సుశాంత్ తో కలిసి భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కి సంబంధించిన సంస్థ `వివిడ్రేజ్ రియాలిటీక్స్`లో వ్యాపార భాగస్వామి అని పోలీసులు కనుగొన్నారు. దీనిని 2019లో రియా స్వయంగా ప్రారంభించింది.

అయితే ఇప్పటివరకూ ఈ సంస్థ గురించి ఎక్కడా రియా ప్రస్థావించనే లేదు. దీంతో ఇది కొత్త సందేహాలకు తెర తీస్తోంది. పోలీసులు దర్యాప్తు కోసం సౌమిక్ చక్రవర్తిని పిలిచారు. తాజా విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సి ఉంటుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఎలా జరిగింది? అంటే అది ఉరి బిగుసుకుని ఊపిరాడక మరణించాడని లేదని.. ఉరి వేశారని రకరకాల సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్న వేళ .. తాజా దర్యాప్తు ఊహించని ట్విస్టుగా మారింది. రియా సోదరుడు అపరాధినా లేక నిరపరాధినా? అన్నది మనం ఊహించడం సరికాదు. పోలీసులు న్యాయవ్యవస్థ ఇందులో నిజానిజాలేంటో తేల్చాల్సి ఉంటుంది.
Please Read Disclaimer