ఈవిడ లేడీ వకీల్ సాబ్!

0

అందం అభినయంతో రాణించిన కథానాయిక జ్యోతిక. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు తమిళ- కన్నడ భాషల్లోనే కాకుండా తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న కథానాయిక. అందాల తార నగ్మా చెల్లెలుగా వెండి తెరకు పరిచయమైన జ్యోతిక.. అనంతరం తన ప్రతిభతో సొంత ఇమేజ్ తో కెరీర్ లో ఎదిగింది. 1997లో వచ్చిన `డోలీ సజా కే రఖా`లో నటించిన ఈ బ్యూటీ.. అనంతరం వాలీ చిత్రంలో గెస్ట్ రోల్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ నుంచి తమిళంలోని `పూవెల్లం కట్టెప్పర్` సినిమాలో అవకాశాన్ని కొట్టేసి తన సత్తా చాటింది. ఇక తమిళ సూపర్స్టార్ సూర్యతో అనేక సినిమాల్లో జత కట్టిన ఈ అమ్మడు .. ఆయన మనసునూ కొల్లగొట్టింది. కొంత కాలం వీరి మధ్య ప్రేమాయణం నడిచాక.. మూడుముళ్ల బంధంతో ఒక్కట్టయ్యారు. అనంతరం కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. కుటుంబం మీదే ఎక్కువ కాన్స్ట్రంటేషన్ చేపినట్టు చాలా సార్లు చెప్పింది. తన భర్త సూర్య అంటే చాలా ఇష్టమని ఆయనకు కూడా తానంటే పిచ్చి ప్రేమ అని ఇంటర్వ్యూలలో ముసిముసిగా చెప్నుకొచ్చింది.

అయితే మరి సినిమాల్లో ఇక నటించరా అని కొందరు యాంకర్లు అడిగిన ప్రశ్నలకు ..’ ఎందుకు నటించను.. సమయం రావాలి.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తాను అంటూ కుండ బద్దలు కొట్టింది. అయితే తెలుగులో మొదటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున .. రవితేజ లాంటి టాప్ స్టార్లతో నటించేసింది. ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో జ్యోతిక తన ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లే పనిలో పడింది. చాలా సెలెక్టివ్ గా లేడీ ఓరియెంటెడ్ కథల్ని ఎంచుకుని.. ఆ తరహా పాత్రల్లో నటిస్తోంది. గతేడాది రాక్షసి- జాక్పాట్ చిత్రాల్లో నటించిన ఆమె తన మరిది కార్తితో కలిసి తంబి చిత్రంలో నటించింది. అయితే ఇవేవీ తెలుగులో ఆశించినంత విజయాలు సాధించలేదు. అయినా ఇప్పుడు మరో లేడీ ఓరియంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళంలో `పొన్ మగళ్ వందాళ్` చిత్రం లో లాయరుగా ఆమె కనిపించనుంది. తెలుగులో ఈ చిత్రం `బంగారు తల్లి` పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని తన భర్త సూర్య నిర్మిస్తుండటం గమనార్హం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో జ్యోతిక లాయర్ గెటప్ లో సీరియస్ ఫేస్ తో కనిపించింది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఇక జ్యోతిక లాయర్ గెటప్ అంటే ఒకవేళ పవన్ తరహాలోనే వకీల్ సాబ్ అనే భావించాలేమో! అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

ఈసారి థ్రిల్లర్ తో ప్లాన్ అదిరింది కానీ.. ఈ సినిమాకి ప్రచారమే మరీ తీసికట్టుగా ఉండడంతో అసలు వస్తోందా లేదా? అన్న సందిగ్ధత అభిమానుల్లో ఉంది. జ్యోతిక రేంజు నటికి తగ్గ ప్రచారం అయితే కనిపించడం లేదు. ఎందుకనో ఇక్కడ లైట్ తీస్కున్నారనే అనిపిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-