గర్ల్ డ్రాగన్ స్పీడ్ సరే.. ఆ థై షోలెందుకు?

0

ఎంటర్ ది గర్ల్ డ్రాగన్.. అంటూ ఆర్జీవీ హంగామా చూశారు కదా! ఆయన చైనా బేస్డ్ మార్షల్ ఆర్ట్స్ సినిమా తీస్తున్నారు కాబట్టే కరోనా పుట్టుకొచ్చిందా? లేక కరోనా విజృంభించాలనే ఆయన సినిమా తీస్తున్నారా? అన్నది అటుంచితే.. ప్రస్తుతం కరోనాని మించిన కల్లోలంలా ఇదిగో ఇక్కడ గర్ల్ డ్రాగన్ దూసుకొస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఆర్జీవీ లెన్సే వేరు.. ఆయన సెన్సే వేరు! ఆ కళ్లలోంచి కథానాయికను చూసే తీరే వేరు! అన్నట్టుగా ఈ పోస్టర్ చూస్తుంటేనే అల్ల కల్లోలమేనన్న భావన కలగక మానదు. మార్షల్ ఆర్ట్స్ పై ఆర్జీవీ పిచ్చి గా తీస్తున్న ఈ సినిమాలో ఆ భరి తెగించిన ఎక్స్ పోజింగులు ఎందుకు? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేడీ బ్రూస్లీ పేరుతో కల్లోలానికి తెర లేపుతున్న ఆయన తెగింపు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంటర్నేషనల్ సినిమా అంటూ ఇందులో లేడీ బ్రూస్లీ గ్లామర్ విన్యాసాల్ని చూపిస్తూ ఏం చేయబోతున్నాడు. ఇంతకుముందు బ్రూస్ లీ జయంతి కానుకగా టీజర్ ని రిలీజ్ చేస్తే అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న ట్రైలర్ ని బ్రూస్ లీ సొంత నగరం చైనా- ఫోషన్ సిటీలో టీజర్ ని రిలీజ్ చేసారు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తున్న ఆర్జీవీ చైనాలోనూ భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన లేడీ బ్రూస్లీ కొత్త పోస్టర్ నెటిజనుల్లో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో లేడీ బ్రూస్ లీని తనదైన మార్క్ లో స్పైసీగా ఆవిష్కరించ్చారు ఆర్జీవీ. విశాఖ బీచ్ లో పరుగులు తీస్తున్న లేడీ బ్రూస్ లీ అంటూ కథానాయిక పూజా బాలేకర్ ని బ్లాక్ బికినీలో చూపించాడు. వాయు వేగంతో పరుగులెత్తుతున్న మాట నిజమే కానీ.. మరీ ఆ థై తక్కలేమిటో! వేడెక్కించే కవ్వించే ఆ విరుపులేమిటో వర్మనే కాస్త క్లారిటీ గా చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-