ఈమె హాట్ నెస్ కు ఫ్యాన్స్ బరెస్ట్

0

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే. పలువురు స్టార్ హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన బాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘హౌస్ ఫుల్ 4’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా కోసం పూజా హెగ్డే గత వారం రోజులుగా ఫుల్ ప్రమోషన్ మూడ్ లో ఉంది. ముంబయి.. ఢిల్లీతో పాటు ఉత్తరాదిన ముఖ్య నగరాలను చుట్టేస్తూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొటుంది.

ఇదే సమయంలో పూజా హెగ్డే తన అందాలతో ప్రేక్షకులకు వింధు చేస్తుంది. ఇంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ స్టిల్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తోంది. పూజా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు చాలా హాట్ గా ఉన్నాయి. పూజా డ్రస్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ మరీ హాట్ గా ఉన్నాయి. పూజా హాట్ నెస్ కు ఆమె ఫ్యాన్స్ హృదయాలు బరెస్ట్ అవుతూ ఉంటాయని కామెంట్స్ వస్తున్నాయి. సినిమా సినిమాకు విభిన్నంగా కనిపించే పూజా హెగ్డే తన ప్రతి ఫొటో షూట్ లో పూర్తి విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫొటోల్లో పూజా చాలా విభిన్నంగా హాట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలే వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురంలో’ మరియు ప్రభాస్ తో ‘జాన్’ చిత్రాలను చేస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఈమె మరో రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు తన అందాలతో ఫ్యాన్స్ కు విందు చేస్తోంది. ప్రస్తుతం ఈమెకున్న క్రేజ్ కారణంగా టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకుంది.
Please Read Disclaimer