బర్త్ డే లుక్: అల.. ఆ పంచ్ లు ఎవరిపై?

0

అల.. వైకుంఠపురంలో అంటూ క్లాసిక్ టైటిల్ ని బన్ని- త్రివిక్రమ్ బృందం ప్రకటించినప్పటినుంచి ఈ సినిమాపై ఆసక్తికర చర్చ సాగుతోంది. `అరవింద సమేత` తర్వాత మరోసారి లేడీ టైటిల్స్ పై ఫేవరిజం ఎందుకో అలా! అంటూ మాటల మాయావిపై యూత్ కామెంట్లు చేశారు. నాయికా ప్రాధాన్యతపై త్రివిక్రమ్ మమకారాన్ని దునుమాడారు. హీరోయిక్ ఇండస్ట్రీలో ఫీమేల్ టైటిల్స్ ఏమిటో అంటూ! వ్యంగ్యాన్ని ప్రదర్శించారు కొందరైతే.

అయితే త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అవుతుందా? ఫ్యామిలీ ఆడియెన్ మొత్తం తన సినిమా థియేటర్లకే రావాలన్నది ఆయన గేమ్. అందుకు తగ్గట్టే టైటిల్స్ ని .. కథ.. కంటెంట్ ని.. కథానాయికని (టైటిల్ పాత్రధారిని) ఎంపిక చేసుకుంటున్నాడు. సేమ్ టైమ్ మాస్ హీరోల్ని ఎంచుకుని కొట్టాల్సిన చోట దెబ్బ కొడుతున్నాడు. ప్రస్తుతం బన్ని- పూజా హెగ్డే జంటగా `అల వైకుంఠపురంలో` తెరకెక్కిస్తున్నాడు. నిన్ననే జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నాం అంటూ బన్ని పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. కోడి పుంజు.. వేట కొడవలితో తలపాగా చుట్టిన దసరా బుల్లోడిలా బన్ని లుక్ అదరిపోయింది.

తాజాగా టైటిల్ పాత్రధారి `అల..` లుక్ రిలీజైంది. నేడు (అక్టోబర్ 13) పూజా బర్త్ డే సందర్భంగా చిత్రబృందం ఈ లుక్ ని రిలీజ్ చేసింది. పూజాకి అదిరిపోయే గిఫ్ట్ ఇదని చెప్పాలి. ఇక ఈ లుక్ లో పూజాలోని కొత్త కోణాన్ని ఎలివేట్ చేశారు. అల.. అంత అమాయకురాలేం కాదు.. సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో కరుకే అని ఈ పోస్టర్ చెబుతోంది. శత్రువుపై ఇలా బాక్సింగ్ పంచ్ లు కురిపించగలిగే లేడీ సీఈవో అని అర్థమవుతోంది. అల.. ఇలా ఆ రెడ్ గ్లోవ్స్ ధరించి స్ట్రైకింగ్ గా వార్నింగ్ ఇస్తోంది ఎవరికో. కార్పొరెట్ సీఈవో అంత తీక్షణంగా చూస్తూ ఎవరికో వార్నింగ్ ఎవరికో. మరీ ఇంతగా బాక్సింగ్ పంచ్ లు ఇవ్వాల్సినంత సన్నివేశమేమిటో తెరపై చూడాల్సిందే. పూజా ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన జాన్ అనే చిత్రంలో నటిస్తోంది. మరో చిత్రం హౌస్ ఫుల్ 4 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.