రొమాన్స్ లో డార్లింగ్ ఎక్కడా తగ్గడం లేదట!

0

రెబల్ స్టార్ ప్రభాస్ చాలా సిగ్గరి అని చెబుతారు. అయితే కథానాయికలతో రొమాన్స్ విషయంలో మాత్రం ఆ సిగ్గు ఎప్పుడూ కనిపించలేదు. అనుష్క- తమన్నా- త్రిష ఇలా ఎందరో అగ్ర కథానాయికలతో వేడి పెంచే రొమాన్స్ చేశాడు కెరీర్ లో. అంతెందుకు సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్ తో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి మరీ రొమాన్స్ చేశాడు.

ఇప్పుడు పూజా హెగ్డే వంతు. జాన్ చిత్రంలో పూజాతో ప్రభాస్ చెలరేగుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో వేడి పుట్టించే రొమాంటిక్ సీన్స్ ఎన్నో ఉన్నాయట. పీరియాడిక్ లవ్ స్టోరీలో అదిరిపోయే రొమాన్స్ ని ప్లాన్ చేసిన రాధాకృష్ణ ఆ సీన్స్ ఎలివేషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదట. ఇటీవలే నాయకనాయికల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించారుట.

ఈ జంట ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి రియల్ గా లైవ్ గానే రొమాన్స్ పండించినట్లు సమాచారం. ఆన్ స్క్రీన్ పై ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు రివీల్ చేసాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదురిందని…తన విజన్ ని మించి సన్నివేశాలు బాగా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసారు. ప్రభాస్ గత సినిమాల్ని మించి ఈ సినిమా కోసం బొర్డర్ దాటేసి ఆ సీన్స్ లో నటించాడని హింట్ ఇస్తున్నాడు. ఇది పిరియాడిక్ లవ్ స్టోరి కాబట్టి రాధాకృష్ణ ఈ లిబర్టీ తీసుకున్నారట.

సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస డార్లింగ్ రోమాంటిక్ సన్నివేశాల్ని ఎంతో అందంగా తన కెమెరాలో బంధించారట. రొమాంటిక్ సీన్స్ లో అమిత్ త్రివేది అదిరిపోయే ఆర్.ఆర్ ని రెడీ చేశారని తెలుస్తోంది. సన్నివేశానుసారం ట్యూన్స్ కంపోజ్ చేసారని యూనిట్ చెబుతోంది. మొత్తానికి రొమాన్స్ కోసం చిత్రబృందం చాలానే శ్రమించిందని దీనిని బట్టి అర్థమవుతోంది.
Please Read Disclaimer