స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ వీళ్ళే!

0

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు టాప్ చెయిర్ ఒకరిద్దరి సొంతం అవుతుంది. అప్పటి వరకూ ఎన్నో పెద్ద సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ అయినా అప్పుడే వచ్చిన మరో హీరోయిన్ కి ఆ చైర్ అప్పగించక తప్పదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ చైర్ ను ఓ ఇద్దరు ముద్దుగుమ్మలు పంచుకుంటూ వరుసగా బడా సినిమా చేస్తున్నారు. ఆ ఇద్దరూ మరెవరు కాదు ఒకరు పూజా హెగ్డే కాగా మరొకరు రష్మిక.

అవును ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ముందుగా వినిపించే పేర్లు వీరివే. ఈ లిస్టులో పూజా హెగ్డే ముందుంది. ‘డీజే’ తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారింది. హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తూ కుర్ర కారుకి ఫేవరేట్ హీరోయిన్ గా మారిన పూజా ఇప్పుడు టాప్ చెయిర్ లో కూర్చొని వరుసగా బడా అవకాశాలు అందుకుంటుంది.

ఇక పూజా డేట్స్ ఏ మాత్రం మిస్సయినా మేకర్స్ కి మరో ఛాయిస్ రష్మిక నే . ఇప్పటికే మహేష్ సరసన నటించిన ఈ కూర్గ్ బ్యూటీ ప్రస్తుతం బన్నీ తో సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి కన్ను రష్మికపై పడుతుంది. ఇదే స్పీడ్ తో మరో రెండు బడా సినిమాలు చేస్తే రష్మిక ఓ ఐదేళ్ళ పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగడం పక్కా అనిపిస్తుంది. మరి పూజా – రష్మిక ఎన్నాళ్ళు ఈ టాప్ సీట్ ను ఎవరికీ ఇవ్వకుండా వారి సొంతం చేసుకుంటారో ?
Please Read Disclaimer