సాలిడ్ హిట్ లేకున్నా స్టార్ హీరోయిన్ అయ్యింది

0

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో పూజా హెగ్డే పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది. కాని ఈమెకు మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మాత్రం పేరు దక్కలేదు. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలు ఒక మోస్తరుగానే ఆడుతూ వచ్చాయి. ఒకటి అర హిట్ అయినా ఆ సినిమాల్లో ఈమె ఉందా లేదా అన్నట్లుగానే ఉంటుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘అలవైకుంఠపురంలో’ మరియు ప్రభాస్ తో ‘జాన్’ చిత్రాల్లో నటిస్తోంది. అల వైకుంఠపురంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా జాన్ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు మినహా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏమీ లేవు. కొన్ని చర్చల దశలో ఉన్నా కూడా అల వైకుంఠపురంలో సినిమా ఫలితాన్ని బట్టి ఈమెను ఎంపిక చేసే విషయమై ఆలోచిస్తున్నారట.

ఇప్పటి వరకు పెద్దగా సక్సెస్ లేకుండానే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల ఫలితాలపై కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఆ సినిమా సినిమాలు సక్సెస్ అయితే పర్వాలేదు ఫలితం తేడా కొడితే మాత్రం పూజా హెగ్డే కెరీర్ డల్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిందీలో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమిళం నుండి ఆఫర్లు వచ్చినా చేయడానికి సిద్దంగా ఉందట.

అనూహ్యంగా అదృష్టంతో స్టార్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డేకు ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి.. దాంతో ఆమె కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer