సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

బుట్టబొమ్మ కి బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్

0

`అల వైకుంఠపురములో` గ్రాండ్ సక్సెస్ పూజా హెగ్డే క్రేజు పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా అరవింద సమేత-అల వైకుంఠపురములో చిత్రాలకు ఎంపిక చేసుకుని త్రివిక్రమ్ పూజా రేంజునే పెంచాడు. అల వైకుంఠపుములో చిత్రంలో బుట్టబొమ్మగా అద్భుతంగా అభినయించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. అసలు పేరు మరిచి బుట్టబొమ్మ అనే పిలుస్తున్నారంతా. బుట్టబొమ్మ పాటకి పాన్ ఇండియా రీచ్ దక్కడం తనకు ప్లస్ అవుతోంది. శిల్పాశెట్టి లాంటి వెటరన్ స్టార్ బుట్ట బొమ్మ పాటని టిక్ టాక్ చేయడం అది కాస్తా వైరల్ అయిపోవడం తెలిసిందే. నేషనల్ మీడియాలో సైతం బుట్టబొమ్మ పాట పాపులరవ్వడం ఒక రకంగా బాలీవుడ్ లో గేట్లు తెరుస్తోందనే చెప్పాలి. తాజాగా ఆక్రేజ్ తోనే బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పిలిచి మరీ పూజాహెగ్డేకి అవకాశం ఇచ్చాడు.

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ఫర్హాద్ సామ్ జీ దర్శకత్వంలో `కబీ ఈద్ కబీ దివాళీ` తెరకెక్కుతోంది. ఇందులో భాయ్ సరసన పూజాని హీరోయిన్ గా ఎంపిక చేసారు. చాలా మంది భామల్ని పరిశీలించిన తర్వాత దర్శకుడు పూజా హెగ్దేని ఖరారు చేసినట్లు వెల్లడించారు. దీంతో పూజ బాలీవుడ్ కెరీర్ కూడా ట్రాక్ లో పడినట్లే. కెరీర్ ఆరంభంలోనే మెహంజదారో లాంటి భారీ చిత్రంలో హృతిక్ లాంటి క్రేజీ స్టార్ సరసన నటించినా ఆ సినిమా పరాజయం పాలవ్వడం మైనస్ అయ్యింది. అటుపై తిరిగి పూజా సౌత్ వైపు చూడాల్సి వచ్చింది.

పూజాకి ఆ తర్వాత బాలీవుడ్ లో సెకెండ్ ఛాన్స్ తొందరగా రాలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో అడుగు పెట్టి సక్సస్ అయింది. గతేడాది హౌస్ ఫుల్-4 చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించింది. హిట్టు అయితే దక్కింది గానీ…సోలో నాయికగా తనకు గుర్తింపేమీ రాలేదు. ఈ నేపథ్యంలో సల్మాన్ భాయ్ సరసన మూడవ ఛాన్స్ దక్కడం హ్యాపీనే. పూజ బాలీవుడ్ కెరీర్ కి ఈ సినిమా చాలా కీలకం. సక్సెస్ దక్కితే అక్కడ బిజీ నాయికగా మారిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ముందస్తుగానే పూజాని లాక్ చేసారని సమాచారం.
Please Read Disclaimer