సల్మాన్ తర్వాత ప్రభాస్ అంటున్న హాట్ బ్యూటీ

0

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లి పోయింది. ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రభాస్కు అభిమానులు ఏర్పడ్డారు. సాహో సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా ప్రభాస్ కోసం నార్త్ ఇండియా జనాలు ఏ స్థాయిలో చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్.. సౌత్ అనే తేడా లేకుండా ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉన్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సల్మాన్ ఖాన్ సినిమాల ను మాత్రమే జనాలు థియేటర్ లకు వెళ్లి చూస్తారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాల ను కూడా అలాగే చూస్తున్నారంటూ హాట్ బ్యూటీ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

ప్రభాస్ తో జాన్ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ప్రభాస్ తో నటిస్తున్న విషయం తెలిసి అంతా గొప్పగా చూస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నావా అంటూ ఎక్కడకు పోయినా చాలా మంది నన్ను అడుగుతున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ చూస్తే కొన్ని సార్లు ఆశ్చర్యం వేస్తుందంటూ పూజా హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఇక జాన్ విషయాలను చెబుతూ ఒక అద్బుతమైన ప్రేమ కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. యూరప్ బేస్డ్ కథ ఇది. ఈ సినిమాను తెలుగులో మాత్రమే కాకుండా హిందీ లో కూడా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ వచ్చే ఏడాదికి పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో కృష్ణం రాజు మరియు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా స్టైలిష్ గా ప్రభాస్ ఈ సినిమా లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ గా జాన్ ప్రచారం జరుగుతోంది. అసలు టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Please Read Disclaimer