జిగేలు రాణి ఆన్ ఫైర్

0

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సినీమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూజా హెగ్డే లాంటి భామలు ఈ కార్యక్రమాన్ని తమ డ్యాన్సులతో కలర్ఫుల్ గా మార్చారు.

ఈ కార్యక్రమంలో పూజ వయొలెట్ కలర్ ఛోళి- లెహంగా ధరించింది. థై స్లిట్ ఉన్న లెహెంగా కావడంతో పూజ ఎంతో హాట్ గా కనిపించింది. డ్రెస్ పై ఉన్న మెరుస్తున్న తళుకులు చూస్తుంటే నిజమైన జిగేలురాణిలా అనిపించింది. ఇలాంటి సెక్సీ డ్రెస్ లో డ్యాన్స్ చేయడంతో అందరి కళ్ళూ పూజ మీదే నిలిచాయి. సినీమహోత్సవం కార్యక్రమంలో పూజ డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజ హాట్ బ్యూటీ అనే సంగతి అందరికీ తెలిసిందే కానీ ఇలా క్రేజీ డ్యాన్స్ చేసి స్టేజిపై మంటలు పెట్టగలదని మాత్రం మొదటిసారి నిరూపించింది. ఈ కార్యక్రమంలో పూజ హెగ్డే డ్యాన్స్ ఒక హైలైట్ గా నిలిచిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇప్పటికే పూజ టాలీవుడ్ లో ఒక క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’.. ప్రభాస్ సినిమా ‘జాన్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. సినీమహోత్సవం కార్యక్రమంలో పూజ ఊపు చూస్తుంటే ఈ రెండు సినిమాల్లో కూడా తన డ్యాన్స్ లతో ప్రేక్షకుల చేత కెవ్వు కేక అనిపించడం ఖాయం అనిపిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home