పూజా ఒకే… రష్మిక సంగతేంటి ?

0

ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోల మధ్య సంక్రాంతి పోటీ నడుస్తోంది. అయితే వీరిద్దరి పోటీలో పడి హీరోయిన్ల మధ్య పోటీ గమనించడం లేదు ప్రేక్షకులు. అవును ఈ సంక్రాంతికి పూజా రష్మిక చెరో బడా సినిమాతో పోటీ పడుతున్నారు.

ఇక ఒక్కొక్కరికీ ఒక్కో స్పెషాలిటీ ఉంది. రష్మిక పర్ఫార్మెన్స్ తో మేజిక్ చేస్తే పూజా గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన అల వైకుంఠ పురములో పోస్టర్ లో పూజా చాలా హాట్ గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక రష్మిక సినిమాలో ఉన్న సంగతి ఈ మధ్యనే గమనించి ఆమెకు సంబంధించి ఇటివలే ప్రమోషన్ చేస్తున్నారు మేకర్స్. టీజర్ లో కూడా రష్మిక షాట్స్ వాడలేదు మేకర్స్. ఇటివలే విడుదలైన సాంగ్ లో ఆమె డాన్స్ తప్ప గ్లామర్ షో లేదు.

‘అల వైకుంఠపురములో’ కి సంబంధించి ముందు నుండే పూజా గ్లామర్ ని వాడుకుంటున్నారు మేకర్స్. సో ఈ లేక్కన చూస్తే గ్లామర్ షో తో రష్మిక మీద పూజాదే పై చెయ్ ఉంటుందేమో చూడాలి.
Please Read Disclaimer