అదుపులో ఉండలేక పోతున్నా : పూజా హెగ్డే

0

కరోనా కారణంగా సెలబ్రెటీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు షూటింగ్స్ అంటూ హడావుడిగా ఉంటూ టైం దొరికితే జిమ్ లో ఎక్కువ సమయం గడిపే తారలు ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతున్నారు. కొందరు హమయ్య అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం ఇంట్లో కూర్చోలేక పోతున్నాం కాని తప్పదు అంటున్నారు. ప్రతి రోజు షూటింగ్స్ కు హాజరు అయితే కాని గడవని వారు కూడా చాలా మంది ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.

ఇక పూజా హెగ్డే ఇటీవల ప్రభాస్ చిత్రం కోసం జార్జియా వెళ్లి వచ్చింది. అప్పటి నుండి ముంబయిలోని తన ఇంట్లోనే పూర్తిగా ఉంటోంది. స్వీయ నిర్భందంలో ఆమె ఉంటున్నట్లుగా ప్రకటించింది. ఈ సమయంలో ఆమె తన ఆహారపు అలవాట్లను పూర్తిగా పక్కకు పెట్టేసిందట. డైట్ ను ఇంతకు ముందు ఫాలో అయ్యేదాన్ని. కాని ఇంట్లో ఉంటున్న కారణంగా డైట్ ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్లుగా చెప్పుకొచ్చింది.

ఇంట్లో డైట్ పాటించక పోవడంతో పాటు వర్కౌట్స్ అస్సు చేయక పోవడంతో లావు పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా ఆమె మాత్రం ఈ పరిస్థితుల్లో డైట్ ను ఫాలో అవ్వడం తన వల్ల కావడం లేదని.. తినే విషయంలో అదుపులో ఉండలేక పోతున్నట్లుగా సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-