పూజాకి ప్రభాస్ ప్రపోజ్ చేస్తే?

0

రెబల్ స్టార్ ప్రభాస్ కు గాళ్స్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. కథానాయికల్లోనూ ప్రభాస్ అంటే ఇష్టపడేవారెందరో. పబ్లిక్ గానే ప్రభాస్ అంటే క్రష్ అని చెప్పిన భామామణులున్నారు. చైనా-జపాన్- తైవాన్- దక్షిణ కొరియాలాంటి దేశాల్లోనూ ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే.. ఆ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ ని పెళ్లాడే అవకాశం వస్తే ఎగరేసుకుపోవాలని బాలీవుడ్ భామలు సైతం క్యూ లో ఉన్నారు. కానీ ముంబై బ్యూటీ పూజా హెగ్దే అభిమానులు హర్ట్ అయ్యేలా మాట్లాడి షాకిచ్చింది.

ఓ లేడీ ఫ్యాన్ ప్రభాస్ మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? మీ నుంచి ఎలాంటి రిప్లై ఇస్తారు? అంటూ ప్రశ్నించింది. దానికి పూజా కొంచెం సీరియస్ అయ్యింది. అదేం చెత్త ప్రశ్న? అసలు అలా అడగొచ్చా? అన్న తీరుగా ఫ్యాన్ కి జవాబిచ్చింది. సినిమాలో ఆయన నాకు ప్రపోజ్ చేయోచ్చేమో కానీ! ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలని నాకు లేదని ఎస్కేప్ అయింది. అయితే పూజ ఇక్కడ మరో విషయం మర్చిపోయింది. కానీ తాను సినిమాల్లోనైనా ప్రభాస్ కు ప్రపోజ్ చేస్తానేమోనన్న మాట కూడా అనలేదు. నిజానికి ఆ ప్రశ్న ఏదో పెద్ద బూతు అన్నట్లు.. తడబడింది. ఓ మేల్ అభిమాని అడిగినట్టు ఫీలైంది.

ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇష్టం ఉంటే ఎస్ అనో లేకపోతే నో అనో చెప్పాలి. కానీ పూజ మాత్రం ఆ ప్రశ్నకు చాలా వంకరగా జవాబిచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన జాన్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఆ లేడీ ఫ్యాన్ ప్రభాస్ ని ఉద్దేశించి పూజ మనసు నొచ్చకుండా…ప్రభాస్ నుంచే ప్రపోజల్ తీసుకొచ్చింది. కానీ పూజ మాత్రం ఈసారికి ఎందుకనో మునగ చెట్టు ఎక్కేసింది.
Please Read Disclaimer