పూజా కి ఆ సినిమా కలిసొస్తుందా?

0

కొందరు స్టార్ హీరోయిన్స్ రేంజ్ కెళ్ళాక మినిమం రేంజ్ హీరోల సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కానీ ఇందుకు తను మినహా అంటూ అఖిల్ తో సినిమా చేస్తుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుస్తున్న పూజ ఓ వైపు ప్రభాస్ తో సినిమా చేస్తూనే మరోవైపు అఖిల్ తో నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అయితే పూజ అసలీ సినిమా ఎందుకు చేస్తోందనే సందేహం ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. టాప్ హీరోలతో జత కట్టాక మళ్ళీ ఓ యువ హీరో పక్కన హీరోయిన్ గా నటించడం ఆమె ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది. నిజానికి ఈ సినిమా పూజ కెరీర్ కి కలిసొస్తుందా అనే సందేహం కూడా ఫ్యాన్స్ లో ఉంది.

నిజానికి పూజ ఈ సినిమా చేయడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందని తెలుస్తుంది. హీరోయిన్స్ కి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడంలో బొమ్మరిల్లు భాస్కర్ ప్రథముడు. బొమ్మరిల్లు హాసినీ క్యారెక్టర్ ను అతని డిజైన్ చేసిన విధానం అద్భుతం. ఇలాంటి అమ్మాయి కూడా ఉంటుందా అనేలా ఆ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ తర్వాత అదే జెనిలియా కి ఆరెంజ్ లో మరో మంచి పాత్ర ఇచ్చాడు. పరుగులో షీలా కి కూడా తన కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఇలా హీరోయిన్స్ కి బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చిన భాస్కర్ అఖిల్ సినిమాలో పూజ కోసం అదిరిపోయే క్యారెక్టర్ రాసాడట. ఇక క్యారెక్టర్ వినగానే పూజ ఇంకో మాట లేకుండా ఒకే అనేసిందట. ఈ లెక్కన చూస్తే పూజ కి ఈ క్యారెక్టర్ కలిసొచ్చేలనే ఉంది.
Please Read Disclaimer