ఎక్కువ ఊహించుకోవద్దు ఆమెది గెస్ట్ రోలే

0

మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న ‘వాల్మీకి’లో వరుణ్ తేజ్ తర్వాత పూజా హెగ్డే క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అనే టాక్ నడుస్తుంది. అయితే విషయంపై లేటెస్ట్ గా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ లో లేట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సినిమాలో ఉండేది కాసేపే అట. అసలు చెప్పాలంటే పూజా జస్ట్ గెస్ట్ రోల్ లో కనిపిస్తుందని అంటున్నారు. లేటెస్ట్ గా హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్ని బయటపెట్టాడు.

సినిమాలో గెస్ట్ రోల్స్ ఎవరెవరు చేసారు..? నితిన్ ఏమైనా కనిపించే అవకాశం ఉందా అని అడగ్గా నితిన్ చేయలేదని కేవలం బ్రహ్మానందం గారు అలాగే సుకుమార్ గారు చేసారని ఆ మాటకి వస్తే పూజా హెగ్డే కూడా గెస్ట్ రోలే అంటూ మనసులో మాటను చెప్పేసాడు. సో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అని ఊహించుకొని వెళ్ళే వారికి ముందే ఇలా అసలు విషయం చెప్పేసాడు దర్శకుడు. అయితే చిన్న క్యారెక్టరే అయినా ఒప్పుకొని చేసిందని అన్నాడు.

సినిమా అంతా వరుణ్ క్యారెక్టర్ అధర్వ క్యారెక్టర్ మీదే నడుస్తుందట. పూజా హెగ్డే ను జస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మాత్రమే తీసుకున్నారట. కొన్ని సన్నివేశాలతో పాటు ఆమెపై వెల్లువొచ్చి అనే రీమిక్స్ సాంగ్ ను షూట్ చేసారట. సో సినిమాలో పూజా హెగ్డే కేవలం కొన్ని నిమిషాలే ఉంటుందన్నమాట. కాకపోతే ప్రమోషన్స్ లో పూజా పోస్టర్స్ నే ఎక్కువగా వాడుకుంటున్నారు మేకర్స్. ఇదే పబ్లిసిటీ స్టాటజి అంటే. మరి ఈ గెస్ట్ రోల్ తో పూజా ఎలా మెప్పిస్తుందో చూడాలి.
Please Read Disclaimer