అఖిల్ సమస్య తీరినట్టేనా ?

0

స్టార్ హీరో వారసుడిగా బహుశా అఖిల్ పడుతున్న ఇబ్బంది గతంలో ఎవరు పడిన దాఖలాలు కనిపించవు. వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ముచ్చటగా మూడు ఫ్లాపులతో ఇంకా సక్సెస్ బోణీ కొట్టని అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 తీస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా మీదే ఉన్నాయి. రెండు నెలల క్రితమే పూజా కార్యక్రమాలు చేసి షూటింగ్ లో హీరోయిన్ లేని మొదటి షెడ్యూల్ ని ఫినిష్ చేసిన టీమ్ ప్రస్తుతం బ్రేక్ ఇచ్చేసింది. అఖిల్ తాజాగా అన్న నాగ చైతన్య వదిన సమంతాలతో కలిసి హాలిడే కోసం స్పెయిన్ వెళ్ళిపోయాడు.

కారణం ఇప్పుడీ సినిమాకు జోడి దొరక్కపోవడమేనట. వేర్వేరు ఆప్షన్స్ చూసి ఆఖరికి పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్టుగా ఇన్ సైడ్ న్యూస్. అయితే పూజా హెగ్డేకు విపరీతమైన పని ఒత్తిడి ఉంది. ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితి ఎంత మాత్రం లేదు. దీంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేసి పూజా డేట్స్ రాగానే అఖిల్ 4 కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు అయితే అఖిల్ కంటే సీనియర్ అయిన పూజా హెగ్డే ఈ బాబుకి తగ్గ జోడిగా అనిపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పూజా రెండో సినిమా ఐదేళ్ల క్రితం వచ్చిన ఒక లైలా కోసం. అందులో చైతు సరసన నటించేసింది. అప్పటికి ఇప్పటికి తనలో కొన్ని మార్పులు వచ్చాయి. మహేష్ బన్నీ తారక్ లంటే బాగా సీనియర్ హీరోలు కాబట్టి వాళ్ళ పక్కన ఇబ్బంది లేదు. కానీ పట్టుమని ఐదు సినిమాల వయసు కూడా లేని అఖిల్ పక్కన పూజా హెడ్జ్ సెట్ అవుతుందా లేదా చూడాలి. ఇవన్నీ అధికారికంగా చెప్పినవి కాకపోయినా ఫైనల్ గా అఖిల్ 4 కు బ్రేక్ పడ్డ మాట వాస్తవమే. అది పూజా కోసమా లేక ఇంకేదైనా రీజనా అనేది కొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది
Please Read Disclaimer