అరెరే.. దుప్పట్లో దూరిందేమిటిలా

0

ఫ్యాషన్ పిచ్చి పీక్స్ కి చేరితే ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ తాపీగా నడుచుకుంటూ వెళుతున్న ఈ అమ్మడిని చూడాల్సిందే. ఏదో హడావుడిలో అలా వచ్చేసిందిలే అనుకోవడానికి లేదు. ఇదో రకం ఫ్యాషన్. ఒళ్లంతా దుప్పటి చుట్టేసినట్టు.. ఆ డ్రెస్ చూస్తుంటే ఏదో ఇంకేదో ఫీలింగ్ పుట్టుకు రావడం లేదూ?

ఇంతకుముందు ప్యారిస్.. అజర్ భైజాన్ ర్యాంప్ పైనే ఇలాంటివి కనిపించేవి. ఇప్పుడు ఊరూ వాడా పాకిరేసింది ఈ సంస్కృతి. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పాకులాడుతూ ఇలా ఫ్యాషన్ ని ఎటో తీసుకుపోతున్నారు. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ ఇదే తీరుగా డోర్ కర్టెన్లు ఒళ్లంతా చుట్టుకుని కనిపించి షాకిచ్చాడు. ఇప్పుడు బూడిద రంగు జంప్ సూట్ లో పూజా హెగ్డే ఇలా దర్శనమిచ్చి షాకిచ్చింది. ఈ లుక్ చూశాక అరెరే దుప్పట్లో దూరిందేమిటిలా.. దుప్పట్లో మిన్నాగులా! అంటూ పంచ్ లు వేస్తున్నారు కుర్రాళ్లు.

ఆర్థిక రాజధాని ముంబై జన్మస్థానంగా పుట్టుకొచ్చిన ఈ అమ్మడి ఫ్యాషన్ ఏ లెవల్లో ఉంటుందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. కెరీర్ పరుగులు పెడుతోంది. అందుకు తగ్గట్టే పూజా ఏం చేసినా చెల్లుతోంది. ఇంతకుముందు మహర్షి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ వెంటనే బ్లాక్ బస్టర్ గద్దలకొండ గణేష్ లోనూ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో మైమరిపించింది. ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మా.. సాంగ్ లో పూజా డ్యాన్సులు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన జాన్.. బన్ని సరసన అల వైకుంఠపురములో వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer