అల లాక్మే ఫ్యాషన్ వీక్ లో

0

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అలా అని పూజ టాలీవుడ్ కే పరిమితం కాలేదు. అటు హిందీ సినిమాలు.. ఇటు తెలుగు సినిమాలు చేస్తూ సౌత్ ను నార్త్ ను ఒకేసారి కవర్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాను షేక్ చేయడం కూడా పూజాకు వెన్నతో పెట్టిన విద్య. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫాలోయర్లతో నిత్యం టచ్ లో ఉంటుంది. అసలు హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం కోసమే కొన్ని సార్లు ఫోటో షూట్లలో పాల్గొంటుందా అనిపిస్తుంది.

పూజ రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. ఫ్యాషన్ కు సంబంధించిన ఈవెంట్ కావడంతో చక్కగా రెడీ అయ్యి అందాల బొమ్మలా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలకు “జయంతి రెడ్డి డిజైన్ దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ లో పాల్గొన్నా. ఇదో అద్భుతమైన అనుభవం. సమయం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో పూజ వయొలెట్ – గ్రే కాంబినేషన్లో ఉన్న ఛోళి – లెహెంగా ధరించి సూపర్ పోజులిచ్చింది. మెడలో ఒక అందమైన నెక్లెస్ ధరించింది. మేకప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. మోడరన్ డ్రెస్సులు వేసుకుంటే ఎంత స్టైలిష్ గా ఉంటుందో ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు అంత ట్రెడిషనల్ గా క్యూట్ గా కనిపిస్తుంది.

ఈ ఫోటోలు నెటిజన్లకు తెగ నచ్చాయి. లైకులతో కామెంట్లతో హోరెత్తించారు. “అమేజింగ్ బ్యూటీ”.. “హీరోయిన్ ఆఫ్ ది ఇయర్”.. “నెక్లెస్ సూపర్ గా ఉంది”.. “క్యూట్ గా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు. పూజ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమా… రెండోది అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’. ఇవి కాకుండా బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home