ఆ చూపులే చుర కత్తులు

0

పాత జ్ఞాపకాల్లో కి వెళితే తీపి గుర్తులెన్నో వెంటాడతాయి. కొంత కాలం ముందుకు జరిగితే నేటి జ్ఞాపకాలే ఎంతో మధురంగా అనిపిస్తాయి. అలాంటి తీపి జ్ఞాపకాల్ని పదే పదే నెమరు వేసుకుంటోంది లేడి కళ్ల చిన్నది పూజా హెగ్డే. తాజాగా పూజా ఓ ఫోటోని షేర్ చేసి.. ఇదే నా థ్రోబ్యాక్ ఫోటో.. ఎలా ఉన్నాను? అంటూ ప్రశ్నించింది అభిమానుల్ని.

హౌస్ ఫుల్ 4 కోసం ఫస్ట్ లుక్ డిజైన్ కోసం టెస్టులు చేశారు. ఆ ఫోటోషూట్ లో అరుదైన ఫోటో ఇది. పీరియాడిక్ లుక్ కోసం రాజ్ కుమారి మాల ఈ టెస్ట్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్ లో నా ఫోన్ తీసుకుని చటుక్కున కొన్ని ఫోటోలు తీసుకున్నా. ఈ ఫోటోలో ఎలా ఉన్నాను.. ఒకసారి చూసి చెప్పండి.. తక్కువ మేకప్ తో ప్రిన్సెస్ లా ఉన్నానా? పాత్రలోకి పరకాయం చేశానా? అంటూ చాలానే ప్రశ్నలు వేసింది.

అయినా పూజా కి ఎందుకంత సందేహం. ఆ కళ్లలోనే దాగి ఉంది కొకైన్ మత్తు. ఆ చురకత్తి లాంటి చూపుల్లోనే ఉంది జిలెటిన్ స్టిక్కు. ఆ అందంలోనే ఏదో మాయ దాగి ఉంది. దానికే కదా మన ఫిలింమేకర్స్ అంతా చిత్తయి పోతోంది. ఇప్పుడెందుకిలా కొత్త సందేహాలు? మహర్షి లాంటి మహేష్ పిలిచి అవకాశం ఇచ్చాడు. మాయావి త్రివిక్రమ్ అంతటివాడే ఫిదా అయిపోయి వరుసగా అవకాశాలిస్తున్నాడు. ప్రభాస్ అంతటి వాడే మేరా జిగిరీ జాన్ అంటూ వెంటపడుతున్నాడు. జిల్ రాధాకృష్ణ అంతటి వారే ఫిదా అయిపోయి అవకాశమిచ్చాడు. ఇంకేం కావాలి పూజా.. అంటున్నారంతా.
Please Read Disclaimer