సినిమాలపై ప్రేమతో ఇలా

0

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ భయపడుతున్న ఈ సమయంలో ప్రయాణాలు పెట్టుకోవడం అంటే భయపడుతున్నారు. ముఖ్యంగా విమాన ప్రయాణాలు.. విదేశీయానాలు అంటేనే బాబోయ్ అనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఓడియర్ చిత్రం కోసం పూజా హెగ్డే తాజాగా జార్జియా వెళ్లింది. జార్జియా వెళ్లిన తర్వాత అక్కడ నుండి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సినిమాపై ప్రేమ తో ఇలా మాస్క్ ధరించి మరీ ప్రయాణం చేయాల్సి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటో పోస్ట్ చేసి కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ లో ప్రభాస్ 20వ చిత్రం షూటింగ్ కు హాజరు అవ్వబోతున్నట్లుగా హ్యాష్ ట్యాగ్ ను జత చేసి చెప్పకనే చెప్పింది. యూరప్ లో గత కొన్ని రోజులుగా ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవలే చేజ్ సీన్ పూర్తి చేసిన యూనిట్ సభ్యులు ప్రస్తుతం టాకీ పార్ట్ కు రెడీ అయ్యారు.

టాకీ పార్ట్ కోసం ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే కూడా అవసరం అయ్యింది. అందుకే పూజా హెగ్డే సాహసం చేసి అక్కడకు వెళ్లింది. ప్రస్తుతం జార్జియా లో అయితే కరోనా ప్రభావం లేదు. అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు చాలా తీసుకుని మరీ షూటింగ్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా అక్కడకు వెళ్లే ముందు వెళ్లిన తర్వాత కూడా మాస్క్ ను తీయడం లేదట. మొత్తానికి ఓడియర్ అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు రాజీలేని పోరాటం సాగిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-