అల: పూజ ఒక్కటే నెగెటివ్ సెంటిమెంట్??

0

ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలానే ఉంటాయి. అయితే కొందరు పట్టించుకుంటారు కానీ మరికొందరు వాటిని పట్టించుకోరు. సంక్రాంతికి విడుదల కానున్న భారీ సినిమాలలో ఒకటి ‘అలా వైకుంఠపురములో’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు పూజ హెగ్డే ఒక నెగెటివ్ సెంటిమెంట్ అనే టాక్ వినిపిస్తోంది.

పూజ ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో ఏవీ నిఖార్సైన హిట్లు కాలేదు. పూజ కెరీర్లో ఉన్న డిజాస్టర్ల సంగతి పక్కన పెడితే తన కెరీర్లో హిట్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని సినిమాలు క్లీన్ హిట్స్ అయితే కాదు. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయితే మరి కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ మార్కుకు ఆమడ దూరంలో ఆగిపోయాయి. ఈ విషయం కొందరు స్టార్ హీరోల వీరాభిమానులకు తెలియదేమో కానీ ట్రేడ్ వర్గాలలో అందరికీ తెలుసు. దీంతో ‘అల వైకుంఠపురములో’ సినిమాకు అలాంటి పరిస్థితే ఎదురవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెగెటివ్ సెంటిమెంట్ ను అధిగమించి మరీ ‘అల వైకుంఠపురములో’ ఒక బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మాత్రం పూజా కెరీర్లో నిఖార్సైన హిట్ లేదనే లోటు మాత్రం తీరిపోతుందని అంటున్నారు.

అయితే ఇదసలు నెగెటివ్ సెంటిమెంట్ కాదు పాడూ కాదు. కొందరు పనిపాట లేనివారు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇలాంటి అర్థరహితమైన సెంటిమెంట్లను లేవనెత్తుతున్నారని స్టైలిష్ స్టార్ అభిమానులు తోసిపుచ్చుతున్నారు. నెగెటివ్ లేదా పాజిటివ్.. ఏదైనా సినిమా విడుదల అయితే కానీ తెలిసే అవకాశం లేదు.
Please Read Disclaimer