ద్యావుడా.. గాల్లో పూజా

0

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో పూజా హెగ్డే పేరు తప్పనిసరిగా ఉంటుంది. ఈమధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘మహర్హి’ లో పూజా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమాలోనూ.. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో పూజ మహా యాక్టివ్. రెగ్యులర్ అప్డేట్స్ తో ఫాలోయర్లను మురిపిస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి అలానే మురిపించే కార్యక్రమాన్ని చేపట్టింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు”జస్ట్ బ్యాట్ షిట్ క్రేజీ #వానపడే రోజు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘బ్యాట్ షిట్ క్రేజీ’ అంటే ఏం లేదు.. ఆనందంతో పిచ్చెక్కినట్టుంది అని అర్థం. నిన్న పూజ ఉన్న ఏరియాలో వాన పడేసరికి ఇలా క్రేజీగా మారిపోయింది. గాల్లోకి ఎగురుతూ ‘గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే’ అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టింది. రెడ్ కలర్ టీ షర్టు.. డెనిమ్ మైక్రో షార్ట్ ధరించడంతో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్యూటీ లాగా కనిపిస్తోంది. పూజ గాలిలో ఎగిరిన సమయంలో పర్ఫెక్ట్ టైమింగ్ తో ఆ ఫోటోను క్యాప్చర్ చేసిన వ్యక్తికి మనం ఒకసారి జేజేలు పలకాలి. ఫోటో తీసుకున్న లొకేషన్ కూడా అదిరిపోయింది. పెయింటింగ్ వేసిన మెట్లు.. పక్కనేమో పచ్చని చెట్లు.. వాన పడి తడిసిన ఫ్లోర్ అన్నీ కేకః కేకస్య కేకోభ్యః.

ఈ ఫోటోకు భలే కామెంట్లు పెట్టారు నెటిజన్లు. ‘గాలిలో ఎగురుతున్న బ్యూటీ క్వీన్’.. ‘ఆసమ్ క్లిక్.. లవ్లీ డ్రెస్’.. ‘జంపింగ్ జపాంగ్’.. ‘క్రేజీ ఏంజెల్’.. ‘ద్యావుడా.. గాల్లోకి ఎగిరింది’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం ‘పూజా నువ్వు ఒలింపిక్స్ లో హై జంప్ చేయాల్సింది’ అన్నారు.