PPE కిట్లతో షూటింగ్ స్పాట్ లో ఏమిటీ ఫోజులు?

0

జాగ్రత్త అవసరమే కానీ మరీ ఇంత జాగ్రత్త అవసరమా? తాను మాత్రం మాస్క్ పెట్టుకోకుండా ఫోటోలకు ఫోజులిస్తుంది. తన సహాయకులు మాత్రం పీపీఈ కిట్లు ధరించాలా? .. అంటే అంటూ పంచ్ లు వేస్తున్నారు బుట్టబొమ్మ అభిమానులు.

మహమ్మారి ప్రతి పరిశ్రమను ఆటాడుకుంటోంది. ముఖ్యంగా వినోద పరిశ్రమను అల్లాడిస్తోంది. టాలీవుడ్ హీరోల్లో ఈ భయం స్పష్ఠంగా కనిపిస్తోంది. ఏ పుట్టలో ఏ పాముందో అని ప్రతి ఒక్కరూ సందేహిస్తూనే సెట్లో అడుగు పెడుతున్నారు. ఇక పూజా హెగ్డే ప్రమాదకర ముంబై నగరం నుంచి హైదరాబాద్ లో అడుగు పెడుతోంది కాబట్టి అందుకు తగ్గట్టే ఇలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం బరిలో దిగిన పూజా హైదరాబాద్ విమానాశ్రయంలో ఇంతకుముందు కనిపించింది.

అఖిల్ తో కలిసి పూజా హెగ్డే తాజా చిత్రం షూటింగ్ లో పాల్గొంటోంది. లొకేషన్ లో దిగగానే తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక లైవ్ ఫోటోని షేర్ చేసుకుంది. ఆన్ లొకేషన్ కారవాన్ తలుపుల మెట్ల వద్ద ఇలా దర్శనమిచ్చింది. సహాయకులు పిపిఇ కిట్లలో ఆ పక్కన ఉన్నారు. ఐదారు నెలల గ్యాప్ తర్వాత ఇలా సందడి నెలకొంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి నిబంధనల ప్రకారం జాగ్రత్తలు బావున్నాయి కానీ.. ముఖానికి మాస్క్ మరిచినట్టుగా ఆ చేతికి శానిటైజర్ పెట్టుకుందో లేదో?