వీడియో: లాక్మేవీక్ ని షేక్ చేసిన డీజే బ్యూటీ

0

ముంబై నగరంలో లాక్మే ఫ్యాషన్ వీక్ 2019 తళుకుబెళుకుల గురించి తెలిసిందే. వారం పది రోజుల పాటు ర్యాంప్ పై అందగత్తెల చిద్విలాసం కన్నులపండుగ చేయనుంది. ఇప్పటికే ఫ్యాషన్ వీక్ ని పలువురు టాప్ మోడల్స్.. అగ్ర కథానాయికలు హీటెక్కించారు. తాజాగా డీజే బ్యూటీ పూజా హెగ్డే వంతు వచ్చింది.

ఈ అమ్మడు లాక్మే ఫ్యాషన్ వీక్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. చాలా మంది కథానాయికలతో పోలిస్తే పూజా ఎలాంటి మేకప్ డామినేషన్ లేకుండా ఎంతో నేచురల్ గా కనిపిస్తోంది. ఎంచుకున్న డిజైనర్ లెహెంగా సెలక్షన్ కళ్లు తిప్పుకోనివ్వలేదు. లెహెంగా ఆద్యంతం పర్పుల్ లుక్ జిగేల్ మనిపిస్తోంది. కాంబినేషన్ గా మెడలో పర్పుల్ హారం ఆకట్టుకుంది. ఈ మొత్తం డిజైన్ ని జయంతి రెడ్డి రూపొందించారు.

మత్తు కళ్లతో చిత్తు చేస్తూ అలా ర్యాంప్ పై నడిచొస్తున్న పూజా స్టైల్ కి జనం పరేషాన్ అవ్వాల్సిందే. చూసే చూపు.. నడక నడత ప్రతిదీ సంథింగ్ స్పెషల్. పూజా అంతే సింపుల్ స్మైల్ తో కట్టి పడేస్తోంది. డీజే చిత్రంలో జస్ట్ 3 నిమిషాల పాటు బికినీలో వెండితెరనే షేక్ చేసిన ఈ అమ్మడు .. మునుముందు అలాంటి ట్రీట్ తెలుగు ప్రేక్షకాభిమానులకు ఇచ్చేందుకు రెడీ అవుతోందన్న సమాచారం ఉంది. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా `అల వైకుంటపురములో`నూ పూజా కథానాయికగా నటిస్తోంది. రానా తో కలిసి భారీ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 4 లోనూ నటిస్తోంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన `వాల్మీకి` చిత్రంలోనూ నాయికగా ఆడిపాడుతోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home