జిమ్ లుక్.. జివ్వనిపించే లుక్

0

టాలీవుడ్ లో యమా జోరుచూపిస్తున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ యూత్ కు హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. రీసెంట్ గా ‘వాల్మీకి’ లో శ్రీదేవి పాత్రలో నటించి మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ రీమిక్స్ లో పూజ గ్లామర్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. పూజకు క్రేజ్ ఎక్కువ కావడంతో సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ పెరిగింది.

పూజ ఎక్కడైనా కనిపిస్తే చాలు.. టక్కున ఫోటోలు తీస్తారు. క్షణం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అవి కాస్తా వైరల్ అవుతాయి. రీసెంట్ గా మరోసారి అలానే జరిగింది. పూజ ఈమధ్య ఒకసారి ముంబైలోని బాంద్రా ఏరియాలో ఒక జిమ్ నుండి బయటకు వస్తూ ఉంటే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించారు. రెడ్ కలర్ ఫుల్ స్లీవ్స్ షర్టు.. బ్లాక్ కలర్ షార్ట్.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి ఎంతో స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది. అసలే చిట్టిపొట్టి షార్ట్ ధరించింది కదా.. సూపర్ మోడల్ తరహాలో కనిపిస్తోంది. ఫోటోలు తీస్తుంటే తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని అనుకోకుండా వారికి అభివాదం చేస్తూ చిరునవ్వుతో పోజులిచ్చింది. సింపుల్ డ్రెస్ లో ఉన్నప్పటికీ ఆ స్టైలే వేరు. అందుకే ఈభామకు ప్రేక్షకుల్లో రాను రానూ క్రేజ్ పెరుగుతూనే ఉంది.

ఇక పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో ‘హౌస్ ఫుల్ 4’ లో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 25 న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా తెలుగులో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. ప్రభాస్ ‘జాన్’ సినిమాల్లో నటిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer