పూజ నిజంగానే స్టన్నింగ్ బ్యూటీ!

0

జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టినా అందంగానే ఉంటుందట. అలాగే ఒంట్లో అందం ఉందనుకోండి. దాదాపుగా ఎలాంటి డ్రెస్ లో అయినా అందంగానే ఉంటారు. మేకప్ ఉన్నా.. లేకపోయినా అందంగానే ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజ హెగ్డే అలాంటి అందం ఉన్న భామే. ‘ముకుంద’ నుంచి నిన్నమొన్నటి ‘వాల్మీకి’ దాకా గ్లామర్ కు శాశ్వత చిరునామాలాగే ఉంది ఈ భామ. నటన విషయంలోఎవరైనా వంకలు పెట్టగలరేమో కానీ అందం విషయంలో వంక పెట్టలేరు.

అయితే ఇలాంటి భామ కూడా మేకప్ లేకుండా కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. రీసెంట్ గా అలా జిమ్ లో కసరత్తులు చేసిన తర్వాత నో-మేకప్ లుక్ లో బయటకు వచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. మేకప్ లేకపోయినా అందం మాత్రం టన్నులలోనే ఉంది. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్.. బ్లూ కలర్ స్పోర్ట్స్ ప్యాంట్ ధరించి.. లైట్ గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ను ధరించిన ఈ భామ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోగ్రాఫర్లకు పోజిచ్చింది. ఆ స్టైల్.. ఆ స్మైల్ చూస్తేనే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. అందుకే ఈ భామకు క్రేజీ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి.

పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. ప్రభాస్ ‘జాన్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా పూజ ఒక హీరోయిన్. ఈ సినిమా అక్టోబర్ 25 న రిలీజ్ కానుంది. ఈ సినిమాల్లో ఏవి హిట్ అయినా మరో రెండు మూడు క్రేజీ ఆఫర్లు రావడం ఖాయం.
Please Read Disclaimer