సూపర్ క్యూట్ డీజే బ్యూటీ

0

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే పేరే చెప్పాల్సి ఉంటుంది. అల్లు అర్జున్.. ప్రభాస్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోందంటేనే మన పూజ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈమధ్యే ‘గద్దలకొండ గణేష్’ లో అందాల భామలా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఈ భామ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో నెటిజన్లను కూడా మెప్పిస్తోంది.

ఈ భామకు ఇన్స్టా లో భారీ ఫాలోయింగ్ ఉంది. 8.3 మిలియన్ల ఫోలోయర్లు పూజను ఫాలో ఫాలో అంటున్నారు. తాజాగా ఈ భామ అభిమానుల కోసం రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ‘సూర్యకాంతి నన్ను తాకినప్పుడు’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో పూజ తన శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా తలపై చెయ్యి పెట్టుకుంది. సూర్యకాంతి పూజను తాకుతుంటే అదే ఒక అద్భుతం అనే ఫీలింగుతో ఒక చిరునవ్వు రువ్వుతూ కళ్ళు మూసుకుంది. స్ట్రైప్స్ ఉండే టాప్.. ప్యాంట్ తో డ్రెస్సింగ్ చాలా స్టైలిష్ గా ఉంది. మరో ఫోటోలో రెండు చేతులను తలపై పెట్టుకుని అందంగా నవ్వింది.. ఎప్పటిలాగే గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్లు చిత్తైపోయి మరీ కామెంట్లు పెట్టారు. “నువ్వు స్టన్నింగ్ పూజ”.. “బ్యూటిఫుల్ పదానికి అర్థమే నువ్వు”.. “సూపర్ క్యూట్ బేబీ” అంటూ కొందరు తమ స్పందన తెలిపారు. పూజ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్ ‘జాన్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer