మహేష్ కే షాకిచ్చిన అల డిమాండ్!

0

ముంబై బ్యూటీ పూజా హెగ్దే టాలీవుడ్ జర్నీ గురించి తెలిసిందే. ఆరంభం వరుస పరాజయాలు ఎదురైనా అవేవీ తన కెరీర్ పై ప్రభావం చూపనేలేదు. టాలీవుడ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ రెండే రెండు సక్సెస్ లు అరవింద సమేత- మహర్షి మాత్రమే. కెరీర్ ప్రారంభించి ఆరేళ్లు పైనే అయినా విజయాల పరంపరం లో మాత్రం వెనుకబడే ఉంది. ఆరంభం బాలీవుడ్ లో బెడిసికొట్టినా ఇటీవలే హౌస్ ఫుల్-4 మంచి సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఈ విజయం మరిన్ని అవకాశాలకు బాట వేసింది. ప్రస్తుతం అక్కడా బాగానే అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక బన్నీ సరసన నటించిన అలవైకుంఠపురములో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాకు ఏర్పడిన బజ్ కారణంగా విజయంపై ధీమాగానే ఉందిట.

అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జాన్ లో నటిస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకుండానే పూజా నిర్మాతలపై బాదుడు మొదలు పెట్టిందన్న ప్రచారం టాలీవుడ్ ని వెడెక్కిస్తోంది. యంగ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తోన్న మేజర్ కోసం అమ్మడిని అప్రోచ్ అయ్యారుట. అయితే పూజా అక్షరాలా 2.50 కోట్లు డిమాండ్ చేసిందిట. ఈ చిత్రాన్ని మహేష్ జీఎంబీ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. పూజ డిమాండ్ చూసి జింఎబీ షాక్ అయిందిట. ప్రస్తుతం కొటిన్నర నుంచి రెండు కోట్లు మధ్య తీసుకుంటోన్న పూజా ఒక్క సారిగా ఇలా అరకోటి పెంచడం తో సైడ్ అయి పోతున్నారు.

మేజర్ బడ్జెట్ మొత్తం కలిపితే 10 కోట్లు ఉంటుందా! పూజా అంత డిమాండ్ చేస్తోందా? అందులో రెండున్నర కోట్లు అంటే ఆషామాషీ కాదు కదా! అంటూ చర్చ సాగుతోంది. ఈ దెబ్బకు జీఎంబీ సంస్థ వేరొక ముంబై మోడల్ ని వెతుక్కొనే పనిలో పడిందిట. జీఎంబీ ప్రొడక్షన్ లోనే అంత డిమాండ్ చేసిందంటే.. మిగతా నిర్మాతలు అప్రోచ్ అయితే బాదుడు పీక్స్ లోనే ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తోన్న పూజ అడిగిందంత ఇస్తారా? లేక ప్రత్యామ్నాయం చూసుకుంటారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-