వాల్మీకి కోసం ఓణీ వేసిందోచ్!

0

వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా ప్రిన్స్ మేకోవర్ అందరినీ థ్రిల్ చేసింది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

‘వాల్మీకి’ కోసం పూజ లంగా ఓణీ ధరించి అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా మారిపోయింది. మొదటి నుంచి పూజకు మోడరన్ గర్ల్ ఇమేజ్ ఉంది. ట్రెడిషనల్ డ్రెస్సులలో అప్పుడప్పుడూ కనిపిస్తుంది కానీ ఇలా పల్లెటూరి గెటప్ వేయడం మాత్రం ఫస్ట్ టైమ్. రెండు జడలు.. చేతికి మట్టిగాజులు పాతకాలం సైకిల్ తొక్కుతూ ఇన్నోసెంట్ గా కనిపిస్తోంది. ఇక సైకిల్ కు తగిలించిన సంచి కూడా క్రీస్తుపూర్వం వాడే సంచి తరహాలోనే ఉంది. సడెన్ గా చూస్తే ‘డీజే’ లో కనిపించిన పూజ ఈ ‘వాల్మీకి’ పూజ ఒకరేనా అనే డౌట్ రావడం ఖాయం. ఈ సినిమాలో పూజ హెగ్డే ‘శ్రీదేవి’ అనే పాత్రలో నటిస్తొందట.

తమిళ సూపర్ హిట్ ‘జిగార్తాండ’ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘వాల్మీకి’ లో తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్. రామ్ ఆచంట.. గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ‘వాల్మీకి’ సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home